Bigg Boss Season 7: వైల్డ్ కార్డ్‌ పోటుగాళ్ల ఆటతో.. బిత్తరపోయిన హౌస్‌లోని ఆటగాళ్లు..! కనీసం బట్టలు కూడా దొరక్కుండా ఇచ్చిపడేశారుగా..

ఓడలు బండ్లు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయనే లైన్‌.. ఎగ్జాక్ట్‌గా రిపీట్ అయింది ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7లో..! నిన్న మొన్నటి వరకు కాలు మీద కాలేసుకుని.. అప్పుడప్పుడూ కష్టపడుతూ.. దానికి మించి ఎంజాయ్‌ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు.. బిగ్ ఝలక్‌ తగిలింది. వాళ్లకు పోటీ నిచ్చేలా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్‌ సభ్యులు.. బిగ్ బాస్ ఇచ్చిన అండతో వాళ్లను ఇరగొట్టడం స్టార్ చేశారు. ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్స్‌కు చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారు.వాళ్లకే ఇచ్చిన స్పెషల్ టాస్క్‌తో.. హౌస్‌లో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్‌కు పోటుగాళ్లయ్యారు. టాస్క్‌లో భాగంగా బట్టలూడదీశారు. వాళ్లను నామినేట్ చేసి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.

Bigg Boss Season 7: వైల్డ్ కార్డ్‌ పోటుగాళ్ల ఆటతో.. బిత్తరపోయిన హౌస్‌లోని ఆటగాళ్లు..! కనీసం బట్టలు కూడా దొరక్కుండా ఇచ్చిపడేశారుగా..
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 10, 2023 | 2:14 AM

బిగ్ బాస్ సీజన్‌ 7 ఫస్ట్ డే కర్టన్‌ రైజ్‌ తర్వాత.. ఆ రేంజ్‌లో జరిగిన ఈ సండే ఎపిసోడ్‌లో.. బిగ్ బాస్లోకి నయా నయా కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. మరో కర్టన్ రైజ్‌ లాగా.. ఐదుగురు సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలోకి ఎంట్రి ఇచ్చారు. బిగ్ బాస్ ముందు నుంచి చెప్పినట్టే..గేమ్‌ను ఉల్టా పల్టా చేశాడు.

ఇక సండే.. బిగ్ డే తర్వాత మొదలైన నామినేషన్స్ డే.. 38 డే రసవత్తరంగా సాగింది. మొదట హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్‌ సభ్యులు.. హౌస్‌లో ఉన్న సభ్యుల మధ్య పరిచయంతో కూల్ గానే సాగినప్పటికీ.. బిగ్ బాస్ ఎంట్రీతో అది టర్న్‌ తీసుకుంది.

వైల్డ్‌ కార్డ్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సభ్యులను పోటుగాళ్లంటూ కోట్ చేసిన బిగ్ బాస్ ఇప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను ఆటగాళ్లుగా కోట్ చేస్తూ ఓ నోట్ పంపిస్తాడు. వీఐపీ రూమ్‌ ఒక్క కెప్టెన్ మాత్రమే వినియోగించాలని.. కానీ ఆరోగ్యం బాలేక పోవడంతో.. శివాజీ కూడా ఉపయోగించవచ్చని చెబుతాడు. మిగిలిన కంటెస్టెంట్స్‌ వీఐపీ రూం బయట ఉన్న రిమైనింగ్ బెడ్స్‌నే ఉపయోగించుకోవాలని ఆదేశిస్తాడు.

ఇక తరువాత పోటుగాళ్లకు సూపర్ పవర్ ఇస్తున్నట్టు చెప్పాడు బిగ్ బాస్.పోటుగాళ్లలో ఇద్దరినీ లగేజ్‌ మేనేజర్స్‌గా చేసి.. ఇప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ లగేజ్‌ను తీసుకోవాలని ఆదేశిస్తాడు బిగ్ బాస్. వాళ్లకు ఒక రోజులో అందరికీ కలిసి 7 క్లోత్స్ మాత్రమే ఇవ్వాలని.. ఆ మరుసటి రోజు.. తీసుకున్న బట్టలు ఇస్తేనే కొత్త బట్టలు ఇవ్వాలని ఆదేశిస్తాడు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఈ నయా పవర్‌తో.. బట్టలు కూడా కోల్పోయారు రిమైనింగ్ కంటెస్టెంట్స్.

ఈ సెగ్మెంట్‌తో తర్వాత మొదలైన నామినేషన్స్ … మరింత రసవత్తరంగా సాగింది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోటుగాళ్లు.. ఒక్కొక్కరు.. హౌస్‌లో ఉన్న ఆటగాళ్లకు బుగ్గసై క్రాస్ మార్క్‌ వేస్తూ.. నామినేట్ చేస్తారు. ఇక ఆ తరువాత ఇప్పటికే హౌస్‌లో ఉన్న సభ్యులకు నామినేషన్స్ ఛాన్స్ ఇచ్చిన బిగ్‌ బాస్… పోటీదారుల్లో ఒకరిని.. ఇప్పటికే హౌస్‌లో ఉన్న ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాలిన చెబుతాడు బిగ్ బాస్. అందుకోసం బాస్కెట్‌లో ఉన్న బాలు తీసుకుని.. ఎవరిని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వారి ఫోటోలను ఆ బాల్‌కు అతికించి.. ఎగ్జిట్ వైపు కిక్ చేయాలని ఆదేశిస్తాడు. అయితే అదే చేసిన ఆటగాళ్లు.. అప్పటిదాకా.. తమను నామినేట్ చేసిన పోటుగాళ్లకు గట్టిగానే షాకిస్తారు.

ఇక ఇంకో వైపు సీక్రెట్ రూమ్‌లో ఉన్న గౌతమ్‌.. సూర్యుడు.. మేఘాలు.. పులి,సింహం.. ఆవేశం అంటూ.. సినిమా డైలాగులు చెబుతూ.. హౌస్‌లో జరిగుతున్న సీన్లను చూస్తుంటాడు. హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వగానే అందరి దూల తీరుస్తా అని తనకు తాను అనుకుంటూ..ఉంటాడు. ఇలా ఈ నామినేషన్స్ ఎపిసోడ్ ఇంకా మిగిలివుండగానే.. ఎపిసోడ్ ముగుస్తుంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..