ప్రముఖ నటుడు బిగ్ బాస్ ఫేమ్ మానస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన బ్రహ్మముడి సీరియల్‌తో బాగా ఫేమస్ అయ్యాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ఇందులో మానస్ పోషించిన రాజ్ పాత్ర అలాగే దీపికా రంగరాజు (కావ్య)తో వచ్చే సీన్లు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మానస్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకు చెందిన శ్రీజతో కలిసి పెళ్లిపీటలెక్కాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. విజయవాడ వేదికగా నవంబర్ 22న మానస్, శ్రీజల వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు మానస్ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇప్పటికీ తమ పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలస్తున్నారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న మానస్ తన ఫ్యామిలీలోకి మరొకరిని ఆహ్వానించాడు. సుమారు నెలక్రితమే పెళ్లిపీటలెక్కిన ఈ నటుడు ఇప్పుడు కొత్త కారును కొన్నాడు. ఖరీదైన బెంజ్ ఎఫ్220డీ కారుని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొత్త కారుతో తన ఫ్యామిలీ నంబర్స్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
‘నా ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త మెంబర్ గురించి మీకు చెప్పడానికి చాలా సంతోషంగాఫీలవుతున్నాను’ అంటూ కారు కొన్న విషయాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు మానస్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు మానస్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నటుడు కొన్న కారు మోడల్ బెంజ్ ఎఫ్220డీ. దీని ధర సుమారు రూ.80-90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించాడు మానస్. సోడా గోలీసోడా, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, ప్రేమికుడు, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లో హీరో, స్పెషల్ రోల్స్ పోషించాడు. అయితే బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యన మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లోనూ ఓ ప్రధాన పాత్ర పోషించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.