
బిగ్ బాస్ సీజన్ 9 అంగరంగవైభవంగా మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 9కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు 9లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి విడుదలైన ప్రోమోలు షో పై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఇక ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్ద పీట వేశారు. సామాన్యులను హౌస్‌లోకి పంపించేందుకు అగ్నిపరీక్ష పేరుతో ఓ షో నిర్వహించారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు వేల సంఖ్యలో అప్లికేషన్స్ రాగా అందులో నుంచి కొంతమందిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించారు.
అదేవిధంగా ఈ సారి బిగ్ బాస్ లో రెండు హౌస్ లు ఉండనున్నాయి. అలాగే రూల్స్ కూడా ఈసారి చాలా మార్చారని తెలుస్తుంది. ఊహించని టాస్క్‌లు, అదిరిపోయే గేమ్స్ ఈ సీజన్ 9లో ఉండనున్నాయి. అలాగే ఈ సీజన్ 9లో నామినేషన్స్ కూడా రసవత్తరంగా ఉండనున్నాయి. ఇక లాంఛింగ్ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ హౌస్‌లను బటర్ ఫ్లై థీమ్‌తో డెకరేట్ చేశారు. ఇక మొదటి వారంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్‌తో షో కొనసాగనుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో మొత్తం మూడు పెద్ద గదులు ఉన్నాయి. అందులో లగ్జరీ రూమ్ కామనర్స్‌కు, సెలబ్రిటీలకు కంటైనర్ రూమ్ కేటాయించారు. అలాగే కెప్టెన్ కోసం ప్రైవేట్ గా స్పెషల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఈసారి రెండు హౌస్‌లలో జరిగే రణరంగం చూసి ఎంజాయ్ చేయండి అంటూ నాగ్ బిగ్ బాస్ హౌస్‌కు తాళం వేశారు.. వచ్చే శనివారం మళ్లీ కలుద్దాం అని బై చెప్పేశారు నాగ్
సామాన్యులను ఒక హౌస్‌లోకి ,సెలబ్రెటీలు ఒక హౌస్‌లోకి పంపించారు నాగ్.. మెయిన్ హౌస్‌లో 6 కామనర్స్‌ను ఓనర్స్‌గా అనౌన్స్ చేశారు నాగ్.. సెలబ్రెటీలు టెనెంట్స్‌గా అనౌన్స్ చేశారు నాగ్..
హౌస్ లో డ్యూటీ రాని వారిలో వారమంతా వంట చేసే డ్యూటీని ప్రియా.. సంజనకు ఇచ్చింది.
బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేసింది శ్రీముఖి.. బిగ్ బాస్ హౌస్‌లోకి మరో కామనర్ ను పంపాలని నాగార్జునను రిక్వెస్ట్ చేసిన శ్రీముఖి. ఒకరికి పర్మిషన్ ఇచ్చారు నాగ్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మర్యాద మనీష్.
హౌస్‌లోకి లాస్ట్ కామనర్‌గా ఎంట్రీ ఇచ్చారు.. మిగిలిన 9 మందిలో లాస్ట్ కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియా శెట్టి.
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి.. సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించాడు సుమన్ శెట్టి. జయం, దైర్యం, 7/జి బృందావన్ కాలనీ సినిమాల్లో మెప్పించాడు.
రాము రాథోడ్, సంజన బట్టలు ఉతికే డ్యూటీ.. ఎవరికీ ఇస్తావు అని శ్రీజను అడగ్గా .. రాము రాథోడ్‌కు డ్యూటీ ఇచ్చింది శ్రీజ.
విన్నర్ అయ్యి చూపిస్తా అని చెప్పుకొచ్చింది దమ్ము శ్రీజ .. తనకు మర్చిపోకుండా ఓటు వేయండి అటు స్టేజ్ పైనే రిక్వెస్ట్ చేసింది శ్రీజ.. గలగల మాట్లాడుతూ సందడి చేసింది శ్రీజ..
బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నవదీప్.. జ్యూరీ మెంబర్‌గా నాలుగో కామనర్‌ను సెలక్ట్ చేశాడు. నాలుగో కామనర్ గా ఎంట్రీ ఇచ్చింది.. శ్రీజ దమ్ము
నాగార్జున కోసం పాట పాడిన రాము రాథోడ్.. తన పాట మిస్ వరల్డ్ స్టేజ్ పై వినిపించింది. అంత పాపులర్ అయ్యాడు రాము అని చెప్పారు నాగ్.. అలాగే తన పాట 516 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది అని తెలిపాడు రాము రాథోడ్
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫోక్ సింగర్ రాము రాథోడ్.. రాను బొంబాయికి రాను సాంగ్ తో పాపులర్ అయ్యాడు రాము రాథోడ్. ఇక బిగ్ బాస్ స్టేజ్ పై కూడా అదే సాంగ్ కు డాన్స్ చేసి అదరగొట్టాడు రాము రాథోడ్
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది సంజన.. తన భర్త గురించి.. తన భర్త తనకు ఎలా సపోర్ట్ చేస్తారో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన..
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి సంజనా గల్రానీ, సంజనకు సంబంధించిన ఓ ఏవీ చూపించారు. ఈ వీడియోలో తన లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పింది. అలాగే తనను అరెస్ట్ చేశారని తెలిపారు. కావాలని తనను ఓ కేసులో ఇరికించారని.. దేవుడి దయ వల్ల కోర్టు తనకు క్లిన్ చిట్ ఇచ్చింది అని తెలిపింది సంజన.
భరణి, రీతూ చౌదరి ఇద్దరిలో గిన్నెలు కడిగే టాస్క్ ఎవరికీ ఇస్తావు అని అడగ్గా.. పవన్ రీతూ చౌదరికి ఇచ్చాడు. వారం మొత్తం రీతూ చౌదరి గిన్నెలు కడగాల్సి ఉంటుంది.,
హౌస్‌లోకి మరో కామనర్.. ఓట్లు ప్రకారం హౌస్‌లోకి డిమాన్ పవన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
భరణిని తిరిగి హౌస్‌లోకి పంపించిన బిగ్ బాస్.. ఆ బాక్స్‌లో ఏముందో చెప్పారు నాగ్. అది ఒక లాకెట్.. దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది హౌస్‌లోనే చెప్తాడు అని నాగార్జున తెలిపారు. డిమాన్ పవన్, భరణికి టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఎవరు ఎక్కువ డిప్స్ కొడతారో చూద్దాం అని టాస్క్ ఇచ్చారు నాగ్. ఆగకుండా 60 డిప్స్ చేశాడు భరణి .
రీతూ చౌదరి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో రీతూ చౌదరి సందడి చేసింది. రీతూ చౌదరి బాలయ్య దబిడి దబిడి సాంగ్‌కు స్టెప్పులేసింది. తన పేరు దివ్య నుంచి రీతూ చౌదరిగా ఎలా మారిపోయిందో చెప్పింది. నాగ్ కు హగ్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చింది రీతూ చౌదరి..
సీరియల్ నటుడు భరణి ఓ బాక్స్‌తో స్టేజ్ పైకి వచ్చాడు.. ఆ బాక్స్ ఏంటి అని అడిగితే సర్ప్రైజ్ అని చెప్పాడు. హౌస్ లోకి ఎలాంటి వస్తువు తీసుకెళ్లకూడదు అని బిగ్ బాస్ చెప్పాడు. ఆ బాక్స్ తీసుకొని తన ఇంటికి వెళ్లిపోవచ్చు అని చెప్పారు. తిరిగి ఇంటికి వెళ్లిపోవడానికి సిద్దమైన భరణిని.. నాగ్ వెనక్కి పంపించేశారు.
సీరియల్ నటుడు భరణి.. ఆరో హౌస్ మెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.. సీరియల్స్‌లో విలన్ పాత్రలతో మెప్పించాడు భరణి. పలు సినిమాల్లోనూ నటించాడు భరణి
హరీష్‌కు టాస్క్ ఇచ్చాడు నాగార్జున.. ఇమ్మానుయేల్, శ్రేష్టి వర్మలో ఇల్లు ఎవరు హోస్ కీపింగ్ ఎవరికి ఇస్తావు అని హరీష్ ను అడగ్గా.. ఇమ్మానుయేల్ కి ఇచ్చాడు..
బిందు మాధవి స్టేజ్ పైకి వచ్చింది. జ్యూరీ మెంబర్‌గా స్టేజ్ పైకి వచ్చిన బిందు మాధవి ఒక కామనర్‌ను సెలక్ట్ చేసింది.. సామాన్యుడిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మాస్క్ మెన్ హరీష్. నేను డిప్రషన్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ నాకు హెల్ప్ చేసింది. హౌస్ లో ఉన్నంత కాలం నేను గుండుతో ఉంటాను అని చెప్పాడు హరీష్..
హోస్‌లోకి ఐదో హోస్ మెట్‌గా ఎంట్రీ ఇచ్చింది.. శ్రేష్టి వర్మ. కొరియోగ్రాఫర్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది శ్రేష్టి వర్మ. బిగ్ బాస్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది శ్రేష్టి వర్మ..
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ నాలుగో హౌస్ మెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఓ ఏవీ( వీడియో) ద్వారా ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు.. ఈ వీడియోలో ఇమ్మానుయేల్ తల్లిదండ్రుల గురించి, తాను రాసిన స్కిట్స్ గురించి, చేసిన కామెడీ గురించి చెప్పుకొచ్చాడు ఇమ్మానుయేల్.. స్టేజ్ పై తన మిమిక్రీతో ఆకట్టుకున్నాడు ఇమ్మానుయేల్..
కళ్యాణ్ కు మొదటి అగ్నిపరీక్ష ఇచ్చిన నాగార్జున.. ఫ్లోరా షైనీ, తనూజ ఇద్దరిలో ఎవరికీ వాష్ రూమ్ క్లినింగ్ డ్యూటీ వేస్తావ్ అని కళ్యాణ్ కు టాస్క్ ఇచ్చాడు నాగ్. వారానికి గాని ఫ్లోరా షైనీ వాష్ రూమ్ డ్యూటీ ఇచ్చాడు కళ్యాణ్..
హౌస్ లోకి మొదటి కామన్ మ్యాన్ ఎంట్రీ జరిగింది.. మొదటి సామాన్యుడిగా కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఓట్లు ఆధారంగా కళ్యాణ్ ను సెలక్ట్ చేశారు.. ఆర్మీ మ్యాన్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్..
తన కెరీర్‌లో ఎదుర్కున్న కష్టాల గురించి ఏవీలో( వీడియో) మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ప్రేమించిన వ్యక్తి తనను హింసించాడు అని చెప్తూ ఎమోష్నలైంది ఫ్లోరా షైనీ
సెకండ్ హౌస్ మెట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫ్లోరా షైనీ (ఆశ షైనీ).. నువ్వు నాకు నచ్చవు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది ఈ చిన్నది. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. డాన్స్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ..
నాగార్జున కోసం మటన్ బిర్యాని తీసుకొచ్చిన తనూజ.. తాను మంచి కుక్ అని.. బాగా వండుతాను అని చెప్పింది తనూజ. అలాగే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అని తన పేరెంట్స్ కు తెలియదు అని చెప్పింది. తన ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీకి దూరం అని తెలిపింది తనూజ.. తెలుగు సినీ పరిశ్రమ తరుపున చెప్తున్నా.. ఆడపిల్లల్ని మా ఇంటి బిడ్డలా చూసుకుంటామని తనూజ తండ్రికి బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి చెప్పారు నాగార్జున
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫస్ట్ హౌస్ మేట్.. సీరియల్ నటి తనూజ.. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చింది తనూజ.. గేమ్ ఛేంజర్ సాంగ్ కు స్టెప్పులేసింది తనూజ
టాప్ 13ను పేరు పేరున పలకరించిన నాగార్జున.. 13మందిలో ఫైర్ ఉంది కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు అని నాగ్ అన్నారు..
అగ్నిపరీక్ష మొత్తాన్ని ఓ ఏవీ( వీడియో) రూపంలో చూపించారు నాగార్జున. ఈ ఏవీలో సామాన్యులు చేసిన హంగామా మొత్తం చూపించారు.. మెంబర్స్ మధ్య టాస్క్ లు, గొడవలు అన్ని ఈ వీడియోలో చూపించారు.
ముందుగా సామాన్యుల నుంచి సెలక్ట్ అయినా టాప్ 13 మెంబర్స్ షోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ 13 మంది నుంచి ఐదుగురు మాత్రమే హౌస్ లోకి వెళ్లనున్నారు.
ఈసారి సీజన్‌లో రెండు హౌస్‌లను ఏర్పాటు చేశారు. ఒక్క హౌస్‌తో ఆట చదరంగం అయ్యేది.. కానీ రెండు హౌస్‌లు అంటే ఇది రణరంగం అని కింగ్ నాగార్జున అన్నారు. సెకండ్ హౌస్ కూడా అదిరిపోయింది..
నాగార్జున హౌస్ మొత్తం చూసి షాక్ అయ్యారు.. అలాగే నాగ్ కు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. మీటర్ పై సుత్తితో కొట్టాలని ఇచ్చాడు.. దాన్ని కూడా నాగ్ పూర్తి చేశారు. దాంతో కిచన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈసారి హౌస్ లో ఊహించనవి జరుగుతాయని బిగ్ బాస్ నాగార్జునకు చెప్పారు. అలాగే నాగ్ కు మరో పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.. స్నేక్స్ అండ్ లేడర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. దాని తర్వాత కెప్టెన్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్.
కళ్లకు గంతలు కట్టుకొని హౌస్ లోకి అడుగుపెట్టారు నాగార్జున.. హౌస్ ను చూడాలంటే టాస్క్ ఉంటుంది అని నాగార్జున టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. గురి తప్పకుండా కత్తి విసరాలి అని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. దాంతో నాగ్ టాస్క్ పూర్తి చేశారు.. దాంతో నాగ్ కు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బిగ్ బాస్..
అభిమానించే సెలబ్రెటీలు , సత్తా చాటే సామాన్యులు ఒకపక్కా అంటూ చెప్పుకొచ్చారు నాగ్.. బిగ్ బాస్ తీరు మారింది, ఆట మారింది అని చెప్పారు నాగ్.. ఈ సీజన్ యుద్ధ భూమిలా ఉంటుందని తెలిపారు బిగ్ బాస్..
స్టైలిష్ లుక్ లో అదరగొట్టిన కింగ్ నాగార్జున.. సోనియా సోనియా సాంగ్ కు స్టెప్పులేసిన నాగార్జున