Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో బిగ్ ట్విస్ట్.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళేది అతడేనా..?
ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. నిన్న మొన్న జరిగిన నామినేషన్స్ మాత్రం గరంగరంగా జరిగాయి. ఒకరి పై ఒకరు కామెంట్స్.. కౌంటర్లు వేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. సీజన్ 7 లో ఇప్పటివరకు అమ్మాయిలే ఎక్కువ ఎలిమినేట్ అయ్యారు. గతవారం తప్ప మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూవస్తున్నారు.
బిగ్ బాస్ లో ప్రస్తుతం 9 వారం నామినేషన్స్ పూర్తయ్యి . ఈ వారాం నామినేషన్స్ లో ఏకంగా 8 మంది ఉన్నారు. . అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. నిన్న మొన్న జరిగిన నామినేషన్స్ మాత్రం గరంగరంగా జరిగాయి. ఒకరి పై ఒకరు కామెంట్స్.. కౌంటర్లు వేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. సీజన్ 7 లో ఇప్పటివరకు అమ్మాయిలే ఎక్కువ ఎలిమినేట్ అయ్యారు. గతవారం తప్ప మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూవస్తున్నారు. లాస్ట్ వీక్ ఊహించని విధంగా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. ఇక ఈవారం కూడా ఒక మేల్ హౌస్ మేట్ ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా ఒకరి మీద ఒకరు గట్టిగానే అరిచి గోల చేశారు. నిజానికి చాలా మంది సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్ లో ప్రియాంక- భోలే, శోభా – రతికా , అమర్ దీప్ – భోలే మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో హౌస్ నుంచి తేజ బయటకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటింగ్ పరంగాను తేజ కు తక్కువ ఓట్లు వస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆలోగా ఏదైనా జరిగితే తప్ప తేజ సేవ్ అయ్యే ఛాన్స్ లు తక్కువ కనిపిస్తున్నాయి. తేజ మొదటి రోజు నుంచి ప్రేక్షకులకు అలరిస్తూ దూసుకుపోతున్నాడు. తన స్టైల్ లో స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. కానీ గత కొద్దిరోజులుగా అతడి ఆట ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. హౌస్ లో శోభా చుట్టూ తిరగడం కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. టాస్క్ లలో కూడా అంతగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి కూడా పెద్దగా ప్రయత్నించడం లేదు తేజ. దాంతో ఈ వారం హౌస్ నుంచి తేజ అవుట్ అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి