Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్.. ఈవారం బయటకు వచ్చేది అతనేనా..?

|

Oct 29, 2022 | 3:19 PM

ప్రేక్షకులు ఏంట్రా బాబు ఇది.. అంటూ తలలు పట్టుకునే స్థాయి కి వచ్చింది బిగ్ బాస్ షో. గత సీజన్స్ లో ఎప్పుడు లేనంతగా ఈసారి ప్రేక్షుకులను నిరాశపరిచింది బిగ్ బాస్.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్.. ఈవారం బయటకు వచ్చేది అతనేనా..?
Bigg Boss 6
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 ఎంటటైన్మెంట్ ఏమో గాని హౌస్ లో జరిగే గొడవలు, ప్రేమాయణాలు, ఏడుపులు, అల్లర్లు కాస్త మితిమీరాయనే చెప్పాలి. ప్రేక్షకులు ఏంట్రా బాబు ఇది.. అంటూ తలలు పట్టుకునే స్థాయి కి వచ్చింది బిగ్ బాస్ షో. గత సీజన్స్ లో ఎప్పుడు లేనంతగా ఈసారి ప్రేక్షుకులను నిరాశపరిచింది బిగ్ బాస్. ఈ విషయాన్నీ నాగార్జున సైతం ఒప్పుకున్నారు. హౌస్ లో ఉన్న వారు సరిగ్గా ఆడటం లేదు అంటూ చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంతే కాదు బిగ్ బాస్ ఏకంగా గేట్లు తెరిచి బయటకు కూడా వెళ్లిపోండి అంటూ సీరియస్ గా చెప్పారు కూడా. ఇక వారాంతం వస్తే కింగ్ నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ క్లాస్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఆదివారం మాత్రం ఎవరో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక ఈ వారం కూడా హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు రానున్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఊహించని విధంగా ఉండనుందని తెలుస్తోంది.

ఈవారం హౌస్‌లో మొత్తం 14 కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. చివరి క్షణంలో సింగిల్ ఎలిమినేషన్‌ జరగడంతో.. ఊహించని ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ఎలిమినేషన్ లో రాజ్, సూర్య పోటీపడగా చివరి నిమిషంలో రాజ్ సేఫ్ అయ్యి ఆర్జే సూర్య ఎలిమినేట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. హౌస్ లో ఉన్న వారిలో చాలా మంది మొహాలు ఎక్కువగా ప్రేక్షకులకు తెలియదు. అయితే పేర్లు, ఫేస్ తెలిసిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. వారిలో ఆర్జే సూర్య ఒకడు. తన మిమిక్రి టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సూర్య. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బన్నీ, ప్రభాస్ వాయిస్ లను దించేస్తాడు సూర్య.

వంట, కిచెన్, ఫిజికల్ టాస్క్, ఎంటర్ టైన్మెంట్.. ఇలా బిగ్ బాస్ ఏది ఇచ్చినా సరే ఆర్జే సూర్య.. ఫుల్ ఎఫర్ట్ పెట్టు ఆడాడు. అయితే సూర్య టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు అని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా సూర్య ఎలిమినేట్ అయ్యి బయటలు వచ్చేశాడని తెలుస్తోంది. అయితే సూర్యకు ఓటింగ్ బాగానే పడిందని కొందరంటున్నారు. మరి నిజంగానే సూర్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..