Bigg Boss 5 Telugu: తెలుగు బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. ఎప్పుడూలేని విధంగా ఈ సారి హౌస్‌లోకి ఏకంగా 19మంది వెళ్లారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచే హౌస్‌లో గందరగోళం, గొడవలు, ఏడుపులు, అల్లర్లు, నానా హంగామాగా సాగుతుంది సీజన్ 5. ఇప్పటికే హౌస్ నుంచి నలుగురు సభ్యులు బయటకు వచ్చేశారు. మొదటి వారం సరయు, రెండోవారం , ఉమాదేవి, మూడోవారం లహరి, అలాగే రీసెంట్‌గా నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక హౌస్‌లో ఉన్న మెల్ కంటెస్టెంట్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా అభిమానులకు మధ్య వార్ జరుగుతుంది. హౌస్‌లో ఉన్న అబ్బాయిలకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగానే ఉంది. ముఖ్యంగా యాంకర్ రవికి అభిమానులు బాగానే ఉన్నారు.
దాంతో రవి అభిమానులు అతడికి సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. మొన్నామధ్య కావాలనే రవిని టార్గెట్ చేస్తున్నారంటూ రవి అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేశారు. తాజాగా మరో పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రవి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అతడి పీఆర్ టీమ్ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.. . బాహుబలిలో కట్టప్ప బాహుబలిని వెనకనుంచి కత్తితో పొడిచే ఫోటోను పోస్ట్ చేసి బాహుబలి రవి .. కట్టప్ప ఎవరో కనిపెట్టండి అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు లైకులు కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది విశ్వను కట్టప్ప అంటూ కామెంట్ పెడుతున్నారు. హౌస్‌లో రవితో కలివిడిగా ఉంటూనే అతడికి వెన్నుపోటు పొడుస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు రవి అభిమానులు.
మరిన్ని ఇక్కడ చదవండి :