
లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన వారందరూ దాదాపు కొత్తవారే. ఈ సినిమా తర్వాత చాలా మంది ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారు. అయితే ప్రధాన పాత్రలో నటించిన అభిజీత్ మాత్రం స్టార్ హీరోగా మారలేకపోయాడు. పెళ్లి గోల , మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్‌లలో మాత్రమే నటించాడు. ఈ క్రమంలోనే తెలుగు బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అభిజీత్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజీత్ తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత అభిజీత్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత అభిజీత్ సినిమాలతో బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజీత్ చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. కేవలం సోషల్ మీడియాలోనే అభిమానులకు టచ్ లో ఉన్నాడు అభిజీత్. ఇక ఇటీవల ఓ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.
ఇదిలా ఉంటే అభిజీత్ కు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అభిజిత్ తన డాన్స్ తో అదరగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అభిజీత్ డాన్స్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకొని డాన్స్ రానట్టు బిగ్ బాస్ హౌస్ లో యాక్ట్ చేశావా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.