Seethamma Vakitlo Sirimalle Chettu: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ హీరోయిన్స్ ఎవరో తెలుసా.?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అచ్చమైన పల్లెటూరి కథఇది. ఈ సినిమా మన ఇంట్లోనో.. లేక మన పక్కింటోనో జరుగుతున్నట్టు ఉంటుంది

Seethamma Vakitlo Sirimalle Chettu: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మిస్ చేసుకున్న క్రేజీ హీరోయిన్స్ ఎవరో తెలుసా.?
Svsc
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 17, 2023 | 3:56 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అచ్చమైన పల్లెటూరి కథఇది. ఈ సినిమా మన ఇంట్లోనో.. లేక మన పక్కింటోనో జరుగుతున్నట్టు ఉంటుంది. కుటుంబాలు, అనుబంధాల గురించి చెప్పే ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక అన్న తమ్ముడి మధ్య ఉండే ఎమోషన్స్ ను చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో.. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సినిమాలో మహేష్ బాబుకు జోడీగా సమంత నటించింది. అలాగే వెంకటేష్ సరసన అంజలి నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో అంజలి నటించిన సీత పాత్రకు ముందుగా మరో హీరోయిన్ అను అనుకున్నారట..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. ఆ పాత్రలో అంజలి చక్కటి అభినయాన్ని పండించి అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ పాత్రలో ముందుగా భూమికను అనుకున్నారట. వెంకటేష్ కు జోడీగా భూమిక అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించారట. గతంలో ఈ ఇద్దరు కలిసి వాసు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే భూమిక మహేష్ కు జోడీగా ఒక్కడు సినిమాలో చేసింది.

అయితే సీతమ్మ వాకిట్లో సినిమా కథ చెప్పి భూమికను ;ఒప్పించాలని శ్రీకాంత్ అడ్డాలా భావించారట.. అయితే క్కడు మూవీలో మహేష్ కు జోడీగా చేసి వదినగా చేయడం ఇష్టం లేక ఆమె నో చెప్పిందని తెలుస్తోంది. అలాగే భూమిక తర్వాత విద్య బాలన్ ను కూడా సీత పాత్ర కోసం సంప్రదించారట.. కానీ ఆమె ఆ పాత్రకు నో చెప్పిందట. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారు. Bhumika, Vidya BalanBhumika, Vidya Balan

ఇవి కూడా చదవండి