AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరణం మల్లేశ్వరి బయోపిక్ లో న‌టించేది ఆమేనా..?

తాజాగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ సీజ‌న్ న‌డుస్తోన్న సంగ‌తి తెలుస్తోందే. ఈ క్ర‌మంలో తెలుగువారి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన‌ ప్రముఖ వెయిట్‌ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది.

కరణం మల్లేశ్వరి బయోపిక్ లో న‌టించేది ఆమేనా..?
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2020 | 10:39 PM

Share

తాజాగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ సీజ‌న్ న‌డుస్తోన్న సంగ‌తి తెలుస్తోందే. ఈ క్ర‌మంలో తెలుగువారి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన‌ ప్రముఖ వెయిట్‌ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లే ప్ర‌ముఖ ర‌చ‌యిత క‌మ్ నిర్మాత‌ కోన వెంకట్‌ ప్రకటించారు. సంజనా రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. కాగా మూవీలో క‌ర‌ణం మల్లీశ్వరి పాత్రలో తొలుత నిత్యా మేనన్‌ను అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

దీంతో పాత్ర‌కు స‌రితూగే న‌టి కోసం అన్వేష‌ణ మొద‌లెట్టింది మూవీ టీమ్. ఇప్పటికే తాప్సీ, రకుల్‌ప్రీత్‌ సింగ్ ల పేర్లు కూడా వినిపించాయి. కానీ వారితో మూవీ యూనిట్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని స‌మాచారం. తాజాగా బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌ పేరు కూడా ప్రచారంలోకి వ‌చ్చింది. భూమి పెడ్నేకర్ ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల‌ద‌ని పేరుంది. భూమితో చిత్రబృందం ఇప్పటికే మంతనాలు జరిపిందట. సినిమాలో న‌టించేందుకు ఆమె కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నెల 15 నుంచి తెలంగాణలో పరిమితమైన సంఖ్యలో న‌టీన‌టులు, టెక్నిషియ‌న్లు పాల్గొని చిత్ర షూటింగ్‌లు చేసుకోడానికి స‌ర్కార్ ఆమోదం తెలిపింది. ఈ నేప‌థ్యంలో త‌ర్వ‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో