Bhola Shankar: భోళాశంకర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..? స్ట్రీమింగ్ ఎందులోనంటే..
మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు మెహర్ రమేష్. అజిత్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కానీ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి తెరకెక్కించారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన ఫ్యాన్ ఎంతో ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్.. ఆ తర్వాత భోళాశంకర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు మెహర్ రమేష్. అజిత్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కానీ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తిసురేష్ ఈ మూవీలో మెగాస్టార్ సిస్టర్ గా నటించింది.
ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకొస్తుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో భోళా శంకర్ మూవీ సెప్టెంబర్ 17న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో భోళాశంకర్ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. సెప్టెంబర్ 17న ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే వీర సింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపిచంద్ మలినేని తో కలిసి ఓ సినిమా చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి. అలాగే బింబిసార లాంటి హిట్ అందుకున్న దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నారు చిరు. త్వరలోనే ఈ మూవీస్ షూటింగ్స్ మొదలు కానున్నాయి.
My heartfelt thanks to the MIGHTY MEGASTAR @KChiruTweets garu for believing me and giving me the chance to present you on BIG screens🙏🏻
Wishing the BOSS of Masses a very happy birthday!🌟
Here’s the concept poster of #MEGA157 – MEGA MASS BEYOND UNIVERSE 🔥
More details soon!… pic.twitter.com/oA0rg3g5Zn
— Vassishta (@DirVassishta) August 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.