Bheeshma Movie :నితిన్ కోసం మాటల మాంత్రికుడు..

Bheeshma Movie : ఇటీవలే యంగ్ హీరో నితిన్ తన ప్రేయసితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. త్వరలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇతడు  హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భీష్మ. `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.  కన్న‌డ క‌స్తూరి  ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా ఆడిపాడుతోంది.  బ‌యోఫామ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మూవీ […]

Bheeshma Movie :నితిన్ కోసం మాటల మాంత్రికుడు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 16, 2020 | 7:59 PM

Bheeshma Movie : ఇటీవలే యంగ్ హీరో నితిన్ తన ప్రేయసితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. త్వరలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇతడు  హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భీష్మ. `ఛ‌లో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.  కన్న‌డ క‌స్తూరి  ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా ఆడిపాడుతోంది.  బ‌యోఫామ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. కొత్త పంథాలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారట. ఈ నెల 17న మూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్‌ని నిర్వహించనుంది యూనిట్. అయితే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మాంటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేయనున్నారు. అటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు గురూజీకి చాలా క్లోజ్. మరోవైపు నితిన్‌కి కూడా ‘అ..ఆ’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే ఆయనే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా  ప్రేమికుల రోజు సందర్బంగా విడుదలైన  సింగిల్ అంతెమ్ శ్రోతలను బాగా ఆకట్టుకుంది. మూవీ ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..