Tollywood : నితిన్, నిఖిల్ ఒకే రోజు పెళ్లిపీటలెక్కనున్నారు..!

Tollywood :  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల లిస్ట్‌లో నుంచి నితిన్, నిఖిల్ ఇద్దరూ సైడైపోనున్నారు. హీరో నితిన్ తన ఎనిమిదేళ్ల ప్రేమను మరో మెట్టు ఎక్కించి ఇటీవలే తన ప్రేయసి షాలిని రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిఖిల్ కూడా తాను ఐదేళ్లుగా ప్రేమిస్తోన్న పల్లవి వర్మతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే ఇతగాడు కూడా నిశ్చితార్థాన్ని ముగించేశాడు. ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు తన లైఫ్‌లోకి భాగస్వాములను ఆహ్వానించనున్నారట. నితిన్-షాలినిలు ఏప్రిల్ […]

Tollywood : నితిన్, నిఖిల్ ఒకే రోజు పెళ్లిపీటలెక్కనున్నారు..!
Follow us
Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2020 | 11:10 AM

Tollywood :  టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోల లిస్ట్‌లో నుంచి నితిన్, నిఖిల్ ఇద్దరూ సైడైపోనున్నారు. హీరో నితిన్ తన ఎనిమిదేళ్ల ప్రేమను మరో మెట్టు ఎక్కించి ఇటీవలే తన ప్రేయసి షాలిని రెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నిఖిల్ కూడా తాను ఐదేళ్లుగా ప్రేమిస్తోన్న పల్లవి వర్మతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే ఇతగాడు కూడా నిశ్చితార్థాన్ని ముగించేశాడు. ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే..ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు తన లైఫ్‌లోకి భాగస్వాములను ఆహ్వానించనున్నారట.

నితిన్-షాలినిలు ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇక అదే రోజు నిఖిల్ పల్లవి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇందుకు సంబంధించి నిఖిల్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే నిఖిల్ వివాహ వేదికపై మాత్రం క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోల జీవితాల్లో ఏప్రిల్ 16 ఓ ప్రత్యేక రోజుగా నిలిచిపోనుంది.

ఇది కూడా చదవండి :ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు..