Ram Charan: ఆ హీరో మరో చిత్రంపై కన్నేసిన చెర్రీ..?

Ram Charan: ఓ వైపు హీరోగానే కాకుండా నిర్మాతగానూ జోరును పెంచేస్తున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. చిరు రీ ఎంట్రీ సమయంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ను ప్రారంభించిన చెర్రీ.. అందులో ఇప్పుడు మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో చిరు నటిస్తోన్న 152వ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు చెర్రీ. ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళ చిత్రాలపై చెర్రీ కన్ను పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే లూసిఫర్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న […]

Ram Charan: ఆ హీరో మరో చిత్రంపై కన్నేసిన చెర్రీ..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 7:43 AM

Ram Charan: ఓ వైపు హీరోగానే కాకుండా నిర్మాతగానూ జోరును పెంచేస్తున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. చిరు రీ ఎంట్రీ సమయంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ను ప్రారంభించిన చెర్రీ.. అందులో ఇప్పుడు మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో చిరు నటిస్తోన్న 152వ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు చెర్రీ. ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళ చిత్రాలపై చెర్రీ కన్ను పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే లూసిఫర్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న చెర్రీ.. తాజాగా మరో మలయాళ చిత్ర హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మలయాళంలో ఘన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్ హక్కులను చెర్రీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ మూవీ రీమేక్‌ హక్కులను ఇప్పుడు చెర్రీ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కథానుగుణంగా ఈ సినిమా చెర్రీ ఇమేజ్‌కు బాగా సెట్ అవుతుంది. మరి ఈ చిత్రంలో రామ్ చరణ్ నటిస్తారా..? లేక మరో హీరోతో ఈ సినిమాను తెరకెక్కిస్తారా..? అసలు ఇందులో నిజమెంత..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ రెండు మలయాళ చిత్రాలు పృథ్వీరాజ్ సుకుమార్‌కు చెందినవే కావడం మరో విశేషం. లూసిఫర్‌కు పృథ్వీ దర్శకత్వం వహించగా.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఆయన నటించారు.  ఇక లూసిఫర్ రీమేక్‌లో చిరు, చెర్రీ కలిసి నటించబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ రీమేక్‌కు సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని కూడా అప్పట్లో టాక్ రాగా.. తాజా సమాచారం ప్రకారం పరశురామ్‌ పేరు ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న చెర్రీ, చిరు-కొరటాల సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.