AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరిగా చూస్తే పోసుకోవాల్సిందే.. సీన్ సీన్‌కు సితారే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

హారర్ కథకు కామెడీని జోడించి చాలా సినిమాలు హిట్ అందుకున్నాయి. అయితే ఓటీటీలోనూ హారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే రకరకాల ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో హారర్ సినిమాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. కొత్త కొత్త హారర్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోని సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఒంటరిగా చూస్తే పోసుకోవాల్సిందే.. సీన్ సీన్‌కు సితారే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Horror Movie
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2024 | 12:37 PM

Share

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా దాదాపు సక్సెస్ అయ్యాయి. హారర్ కథకు కామెడీని జోడించి చాలా సినిమాలు హిట్ అందుకున్నాయి. అయితే ఓటీటీలోనూ హారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే రకరకాల ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో హారర్ సినిమాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. కొత్త కొత్త హారర్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోని సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. ఒంటరిగా అస్సలు ఈ సినిమాను చూడలేం. ఇంతకూ ఈ సినిమా ఎక్కడ ఉంది.? అంటే..

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బాబోయ్.. ఇది కదా కిక్ అంటే..! బిగ్ బాస్ హోస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ

ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో చ్చోరీ సినిమా ఒకటి. ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ ను రాబడుతోంది. ఈ సినిమా కథ సాక్షి యువతి చుట్టూ తిరుగుతుంది.ఆ యువతి గర్భవతి ఆమె జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో భర్తతో కలిసి ఒక గ్రామానికి వెళ్తుంది. అయితే అక్కడ వారు ఓ పాత ఇంట్లో ఉంటారు. ఓ ఊరిలో చేరుకుతోట మధ్యలో ఓ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో సాక్షితన భర్తతో కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇది కూడా చదవండి : Venu Swamy: రకుల్ కూడా భర్త నుంచి విడిపోతుంది.. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పానన్న వేణు స్వామి

భర్త ఇంట్లో లేని సమయంలో సాక్షికి అనేక భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆమె ఆ ఇంటి గురించి, ఆ ప్రాంతపు దెయ్యాల కథల గురించి తెలుసుకుంటుంది. ఆ దెయ్యాల వల్ల ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. అసలు ఆ ప్రాంతం నుంచి ఆ ఇంట్లో నుంచి ఎలా బయట పడ్డారు. అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో చాలా భయంకరమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా పేరు చ్చోరి. బాలీవుడ్ లో ఈ సినిమా తెరకెక్కింది. 2021లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది. ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాలి. ఈ సినిమా ఇప్పుడు మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.