కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి వివాదంలో ఇరుక్కున్నాడు. అతనిపై బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు రక్షిత్ శెట్టిని పిలిపించి మాట్లాడారు. విచారణకు హాజరు కావాలని హీరోకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే..అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నారనే ఆరోపణలతో రక్షిత్ శెట్టి చిక్కుల్లో పడ్డాడు. నవీన్ కుమార్ అనే వ్యక్తిపై రక్షిత్ శెట్టి ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్‌కి MRT మ్యూజిక్‌తో భాగస్వామ్యం ఉంది. ”న్యాయ ఎల్లీడు..’, ‘గాలిమాతు..’ పాటలను రక్షిత్ శెట్టి నిర్మించిన ‘బ్యాచిలర్ పార్టీ’లో అక్రమంగా వాడుకున్నారని తెలిపారు. ఈ మేరకు కాపీ రైట్ ఆరోపణలపై రక్షిత్ శెట్టిపై పోలీస్ కేసు నమోదైంది. కాగా ఈ ఏడాది జనవరిలో ఈ సినిమా పాటలను ఉపయోగించడం గురించి రక్షిత్ శెట్టితో చర్చ జరిగింది. అయితే సినిమా పాటను వాడుకున్నారనే చర్చ సరిగా లేదు. దీంతో చర్చలు ముందుకు సాగలేదు. బ్యాచిలర్ పార్టీ సినిమా మార్చి 2024లో విడుదలైంది. నేను ‘బ్యాచిలర్ పార్టీ’ సినిమా గమనించినప్పుడు 2 పాటలను వాడుకున్నారు.
హీరో, నిర్మాత రక్షిత్ శెట్టి కాపీరైట్, ప్రసార హక్కులను కొనుగోలు చేయకుండానే తన పాటలను ఉపయోగించుకున్నారని నవీన్ ఆరోపిస్తున్నారు. దీంత అతనితో పాటు పరమవ స్టూడియోస్ పై కేసు పెట్టినట్లు ఫిర్యాదు దారుడు చెబుతున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటుడు రక్షిత్ శెట్టికి యశ్వంత్‌పూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మౌఖికంగా విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు.
For the pondering curious minds, seeking to know the answer to the most sought out question ‘who am I’.. here it is! #EKAM!
Out now, we hope you’ll enjoy this series as much as we loved bringing it to you ♥️
Streaming Now : https://t.co/ZQQK9QoE7y pic.twitter.com/f0xVoWnhj5
— Rakshit Shetty (@rakshitshetty) July 13, 2024
కాగా క న్నడ సినీ పరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో రక్షిత్ శెట్టి ఒకరు. ముఖ్యంగా ఫీల్ గుడ్ మూవీస్ తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక రక్షిత్ శెట్టిన నటించిన 777 చార్లీ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అలాగే సప్త సాగరాలు దాటి సిరీస్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు. ప్రస్తుతం ఏకం అనే వెబ్ సిరీస్ కు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.