Suchandra Dasgupta: సినీ పరిశ్రమలో కొనసాగుతున్న విషాదాలు.. ట్రక్ ఢీ కొట్టి నటి సుచంద్ర మృతి.. డ్రైవర్ అరెస్ట్..

|

May 22, 2023 | 12:55 PM

షూటింగ్ ముగించుకుని సోదేపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకోవడానికి సుచంద్ర ఒక యాప్ ద్వారా బైక్‌ను బుక్ చేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు సుచంద్ర ప్రయాణిస్తున్న బైక్ కు ఎదురుగా ఒక  సైక్లిస్ట్ వచ్చాడు. దీంతో బైక్ రైడర్‌ సడన్ బ్రేక్ వేశాడు.

Suchandra Dasgupta: సినీ పరిశ్రమలో కొనసాగుతున్న విషాదాలు.. ట్రక్ ఢీ కొట్టి నటి సుచంద్ర మృతి.. డ్రైవర్ అరెస్ట్..
Suchandra Dasgupta
Follow us on

సినీ పరిశ్రమలో వరస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ బెంగాలీ నటి ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. షూటింగ్ ముగించుకుని తిరిగి వెళ్తున్న నటి సుచంద్ర దాస్‌గుప్తా మృతికి కారణమైన డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. బారానగర్ పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. టీవీ సీరియల్ షూటింగ్ పూర్తి చేసుకున్న సుచంద్ర దాస్‌గుప్తా బైక్ టాక్సీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరానగర్‌లో జరిగింది

మీడియా కథనాల ప్రకారం.. షూటింగ్ ముగించుకుని సోదేపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకోవడానికి సుచంద్ర ఒక యాప్ ద్వారా బైక్‌ను బుక్ చేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు సుచంద్ర ప్రయాణిస్తున్న బైక్ కు ఎదురుగా ఒక  సైక్లిస్ట్ వచ్చాడు. దీంతో బైక్ రైడర్‌ సడన్ బ్రేక్ వేశాడు. అప్పుడు బైక్ 10 చక్రాల ట్రక్కును ఢీకొట్టింది. వెనకాల కూర్చున్ననటి ద్విచక్ర వాహనం నుండి పడిపోయింది. ఆ తర్వాత ఆ ట్రక్కు నటిపైకి వెళ్లిందని నివేదికలు పేర్కొన్నాయి. అక్కడికక్కడే మరణించింది. అయితే అప్పుడు సుచంద్ర హెల్మెట్ ధరించి ఉంది. అయినప్పటికీ సుచంద్ర ప్రాణాలు దక్కలేదు.

సుచంద్ర దాస్‌గుప్తా అనేక ప్రముఖ బెంగాలీ టీవీ షోలలో కనిపించారు. గౌరీ షోలో సపోర్టింగ్ రోల్ పోషించి పాపులర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..