బాలీవుడ్‌లో పాగా వేస్తారట..! రచ్చ గెలిచేందుకు గట్టిగానే ఫోకస్‌ పెట్టిన సాయి శ్రీనివాస్..

|

May 11, 2023 | 1:02 PM

ఛత్రపతిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్‌లో పెద్దగా ప్రూవ్ చేసుకున్నది ఏమీ లేకపోయినా.. బాలీవుడ్‌లో తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. మూవీ కెరీర్‌కు సంబంధించి తన ఫ్యూచర్‌ విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు బెల్లంకొండ బాబు. దీనికి తగ్గట్టుగానే బాలీవుడ్‌లో బిగ్ లైనప్‌ను సిద్ధం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో పాగా వేస్తారట..! రచ్చ గెలిచేందుకు గట్టిగానే ఫోకస్‌ పెట్టిన సాయి శ్రీనివాస్..
Bellamkonda Sai Srinivas
Follow us on

ఛత్రపతిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్‌లో పెద్దగా ప్రూవ్ చేసుకున్నది ఏమీ లేకపోయినా.. బాలీవుడ్‌లో తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. మూవీ కెరీర్‌కు సంబంధించి తన ఫ్యూచర్‌ విషయంలోనూ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు బెల్లంకొండ బాబు. దీనికి తగ్గట్టుగానే బాలీవుడ్‌లో బిగ్ లైనప్‌ను సిద్ధం చేస్తున్నారు.

తెలుగులో ప్రభాస్‌ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ బ్లాక్ బస్టర్‌ ఛత్రపతి. టాలీవుడ్‌లో ప్రభాస్ ఇమేజ్‌ను, మార్కెట్ రేంజ్‌ను డబుల్ చేసిన సినిమా ఇది. అందుకే తన బాలీవుడ్‌ డెబ్యూకు ఈ భారీ చిత్రాన్ని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.

తెలుగు ఛత్రపతిని దాదాపు యధాతథంగా హిందీ ప్రేక్షకుల కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్‌ చేశారు. క్వాలిటీతో పాటు యాక్షన్‌ ఎపిసోడ్స్ పరంగా మరింత భారీగా బాలీవుడ్ ఛత్రపతిని సిద్ధం చేశారు. తనను వెండితెరకు పరిచయం చేసిన వివి వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రజెంట్ ఛత్రపతి ప్రమోషన్‌లో ఫుల్ బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తన ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గురించి కూడా హింట్ ఇచ్చారు. ఛత్రపతి తరువాత కూడా నార్త్ ఇండస్ట్రీలోనే జర్నీ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం తెలుగు మూవీ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ వర్క్‌లో బిజీగా ఉన్న ఈ హీరో… దీని తర్వాత బ్యాక్‌ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఛత్రపతి సినిమాను నిర్మించిన పెన్‌ స్టూడియోస్ బ్యానర్‌లోనే మరో రెండు హిందీ సినిమాలు చేసేందుకు సాయి శ్రీనివాస్ రెడీ అవుతున్నారు. మొత్తానికి బాలీవుడ్‌లో పాగా వేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది పెద్దల మాట. మరి బెల్లంకొండ బాబు ఇంట గెలవకున్నా.. రచ్చ గెలుస్తారేమో వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తలు చదవండి