దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక(Hansika). మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. హన్సిక తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోను ఈ అమ్మడు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల కాలంలో తెలుగులో హన్సిక సినిమాలు తగ్గించింది. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వస్తుంది హన్సిక. తాజాగా మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది హన్సిక.
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి ఇటీవల విడుదలైన టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రంలోని మెరిసేలే.. మెరిసేలే అనే వీడియో లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ.. చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక టీజర్‌లో చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. మెరిసేలే మెరిసేలే అనే లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేశాం. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సత్య యామిని ఆలపించారు. మార్క్ రాబీన్ స్వరాలు సమకూర్చారు. తప్పకుండా చిత్రం అందరిని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :