ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప (Pushpa). గత నెలలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి నార్త్ వరకు పుష్ప క్రేజ్ కొనసాగుతుంది. ఈ సినిమాలో మొదటిసారి ఊర మాస్ పక్కా లుక్‌లో నటించి అదరగొట్టాడు. ఇక ఈ సినిమానే కాకుండా.. సాంగ్స్ కూడా ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ఇందులోని ప్రతి పాట నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా శ్రీవల్లి, ఊ అంటావా.. ఊహు అంటవా.. సామి సామి పాటలకు తమస్టైల్లో స్టెప్పులేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. సామాన్యులే కాకుండా క్రికెటర్స్, సెలబ్రెటీస్ పుష్ప పాటలకు కాలు కదుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. పుష్ప క్రేజ్ క్రికెట్ ఆటగాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా.. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు. అలాగే పుప్ప రాజ్ డైలాగ్స్‌తో రచ్చ చేశారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. బీబీఎల్‌లో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చెందిన అమిత్ హసన్ వికెట్ తీశాడు. అంతేకాకుండా.. ఎక్స్ ట్రా కవర దిశగా బ్యాట్స్ మెన్ కొట్టిన షాట్‌ను ఫీల్డర్ పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో అమిత్ హసన్ అల్లు అర్జున్ డైలాగ్.. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ మేనరిజాన్ని చూపిస్తూ. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Hype is Real…..@alluarjun ??
Craze beyond boundaries means this only …..
Bangladesh Premier league
Celebration of a Player by taking a wicket….#ThaggedheLe #PushpaRaj #PushpaTheRise pic.twitter.com/nWLOk8XWfI— Censor Buzz (@CensorBuz) January 22, 2022
Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆసక్తికరంగా భామా కలాపం టీజర్..
Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..
Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..
Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..