AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్‌కు మీవల్లే నష్టం జరిగింది.. నేనే సాక్ష్యం.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్లగణేష్ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్.. ఆయన గురించి ఎవరైనా ఏమైనా అంటే ఫైర్ అవుతారు. సోషల్ మీడియాలో ట్వీట్స్ తో మండిపడతారు.

పవన్ కళ్యాణ్‌కు మీవల్లే నష్టం జరిగింది.. నేనే సాక్ష్యం.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Bandla Ganesh
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2025 | 6:42 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఒకప్పుడు నటుడిగా వరుసగా సినిమాలు చేసిన బండ్ల  గణేష్ ఆతర్వాత నిర్మాతగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ .. సమయం దొరికినప్పుడల్లా ఆయనను తెగ పొగిడేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ బండ్లగణేష్ మాత్రం ఆయనకు భక్తుడు. కాగా నటుడిగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా ఆంజనేయులు. ఈ సినిమా తర్వాత తీన్ మార్ , గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేశాడు. ఇక బండ్లగణేష్ రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బండ్లగణేష్ తన ట్వీట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు.

తాజాగా మరోసారి బండ్ల గణేష్ తన ట్వీట్ తో వార్తల్లో నిలిచారు. నిర్మాత సింగనమల రమేష్ కు బండ్ల కౌంటర్ ఇచ్చారు. తాజాగా శింగనమల రమేష్ ప్రెస్ మీట్ పెట్టి పులి, ఖలేజా సినిమాలతో నాకు 100 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. అలాగే ఏడాది చేయాల్సిన సినిమాలు మూడేళ్లు అయ్యాయని రమేష్ బాబు అన్నారు. దానికి బండ్ల కౌంటర్ ఇచ్చారు.

” సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు