
Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ ను దేవుడిగా కొలిచే అభిమానులు ఉన్నారు. పవన్ కు ఉన్న వీరాభిమానుల్లో నిర్మాత , నటుడు బండ్ల గణేష్ ఒకరు. పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ అభిమాని మాత్రమే కాదు భక్తుడు కూడా.. ఈ విషయాన్ని సందర్భం దొరికినప్పుడల్లా బండ్ల చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలను బండ్ల షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు బండ్ల . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ను దేవర అంటూ సంబోధిస్తున్నారు బండ్ల గణేష్. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో బండ్ల గణేష్ స్పీచ్ హైలైట్ అయిన విషయం తెలిసిందే. “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” అంటూ పవన్ ను ఆకాశానికెత్తేశారు బండ్లగణేష్ . ఆయన స్పీచ్ పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఇక ఇప్పుడు బండ్ల షేర్ చేసిన పవన్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో పవన్ పొట్టి నిక్కరు, కాటన్ షర్ట్ ధరించి కనిపించరు పవన్. ఈ ఫొటోకు ఈ పసివాడే నా దేవర అంటూ క్యాప్షన్ ఇచ్చారు బండ్ల గణేష్ . ఈ ఫోటో పై రకరకాల కామెంట్లు కురిపిస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఇక బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా పవన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఆ విషయాన్ని స్వయంగా బండ్ల గణేషే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ పసివాడే నా దేవర @PawanKalyan ? pic.twitter.com/LNly8GzUo1
— BANDLA GANESH. (@ganeshbandla) June 30, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :