Unstoppable with NBK S4: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. బాలయ్య షోలో గ్లోబల్ స్టార్

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు సీజన్ 4 తో అలరిస్తుంది. ఇక బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ రోల్స్ చేస్తారో.. ఈ టాక్ షోలో అంత జోవియల్ గా ఉంటారు.

Unstoppable with NBK S4: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. బాలయ్య షోలో గ్లోబల్ స్టార్
Balakrishna, Ramkrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2024 | 1:31 PM

అన్ స్టాపబుల్ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా దూసుకుపోతుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు.. టాక్ షోతో కూడా రాణిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ మూడు సీజన్స్ పూర్తి చేసుకొని నాలుగో సీజన్స్ దూసుకుపోతుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4లో చాలా మంది స్టార్ నటీనటులు గెస్ట్ గా హాజరయ్యారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య అడిగే ప్రశ్నలకు.. వెంకటేష్ సరదా సమాదానాలు చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్ లో అనిల్ రాఘవపూడి కూడా ఈ టాక్ షోలో సందడి చేశారు. ఇక ఇప్పుడు ఆన్ స్టాపబుల్ షోకి మరో స్టార్ హీరో హీరో కూడా హాజరుకానున్నారు.

ఆన్ స్టాపబుల్ షోకి ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. రామ్ చరణ్ బాలయ్య షోకు హాజరు కానున్నారు. గతంలో ప్రభాస్ గెస్ట్ గా హాజరయినప్పుడు బాలకృష్ణ చరణ్ తో ఫోన్లో మాట్లాడారు. నా షోకు ఎప్పుడొస్తావ్ అని బాలయ్య అడగ్గా మీరు పిలవడమే లేటు అని చరణ్ అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య తో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ రేపు( డిసెంబర్ 31)న జరగనుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సునీల్, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ బాలయ్య షోకు హాజరుకానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!