Daaku Maharaaj Twitter Review: నటసింహం విశ్వరూపం.. బాలయ్య డాకు మహారాజ్ ఎలా ఉందంటే..

|

Jan 12, 2025 | 6:55 AM

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Daaku Maharaaj Twitter Review: నటసింహం విశ్వరూపం.. బాలయ్య డాకు మహారాజ్ ఎలా ఉందంటే..
Daaku Maharaaj
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా నేడు థియేటర్స్ లోకి రానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీలో బాలయ్య బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే..

నందమూరి ఫ్యాన్స్‌కు, ఈ సంక్రాంతి పండుగ మరిచిపోలేనిది మారిపోతుంది అని అంటున్నారు నెటిజన్స్. బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఏం కావాలో ఈ సినిమాలో పక్కాగా చూపించారని. యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరికొంతమంది ఫ్యాన్ ఏమంటున్నారంటే..

డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ..

డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని నెటిజన్స్ అంటున్నారు.. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, బాబీ డైరెక్షన్, ఎలివేషన్స్, తమన్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి.