నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పథకం పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. డాకూ మహారాజ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.
తాజాగా డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది. ఈ ఏ ఈవెంట్ కంటే ముందే డాకూ మహారాజ్ నుంచి రిలీజింగ్ ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ” ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఓ బుల్లెట్ కూడా అయినా కింద పడకుండా అంతమందిని నరికాడంటే.. అతను మనిషి కాదు వైల్డ్ యానిమల్ ” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.
ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెస్ ఎక్కువగా చూపించారు. అలాగే ఈ ట్రైలర్ లో తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనే చెప్పాలి. అలాగే బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్తిస్తున్నాయ్. రాయలసీమ నా అడ్డా.. చంపడంలో మాస్టర్స్ చేశా.., నువ్వు అరిస్తే బార్కింగ్ నేను అరిస్తే అంటూ బాలయ్య చెప్పగానే బ్యాగ్రౌండ్ లో సింహం గర్జన,… అబ్బో అన్ని సూపరో సూపర్.. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి