బిడ్డ‌తో క‌లిసి ఎందుకు న‌టించ‌ను…ఎన్టీఆర్ పై బాల‌య్య కామెంట్స్..

ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించే విష‌య‌మై తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తన బిడ్డతో కలిసి యాక్ట్ చెయ్య‌డానికి తానెప్పుడూ సిద్ధమే అని చెప్పారు.

  • Ram Naramaneni
  • Publish Date - 7:43 am, Wed, 3 June 20
బిడ్డ‌తో క‌లిసి ఎందుకు న‌టించ‌ను...ఎన్టీఆర్ పై బాల‌య్య కామెంట్స్..

ఎందుకో తెలియ‌దు కానీ నంద‌మూరి ఫ్యామిలీలో బాల‌య్య‌కు, జూనియ‌ర్ ఎన్టీఆర్ కు మ‌ధ్య స్మాల్ గ్యాప్ ఉన్న‌ట్లు అనిపిస్తుంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు వేదిక‌ల‌పై..మేమంతా ఒక‌టే అని ప్ర‌క‌టించినా కూడా కొంద‌రు మాత్రం దూరం ఉంద‌నే చెబుతుంటారు. వీరిద్ద‌రూ క‌లిసి ఒక మల్టీస్టార‌ర్ చేస్తే ఈ అనుమానాల‌న్నీ ప‌టాపంచ‌లు అవుతాయి. ఇది నంద‌మూరి అభిమానుల మాత్ర‌మే కాదు సినీ ప్రియులు కోరుకునే అంశం కూడా. వీరి కాంబోలో సినిమా అంటే అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. గతంలో కల్యాణ్‌ రామ్ వీరి క‌ల‌యిక‌లో ఓ చిత్రం పట్టాలెక్కిస్తారని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ, ఏర్పాట్లు ముందుకు వెళ్ల‌లేదు. ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించే విష‌య‌మై తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.

తన బిడ్డతో కలిసి యాక్ట్ చెయ్య‌డానికి తానెప్పుడూ సిద్ధమే అని చెప్పారు. “మంచి కథ దొరికితే జూనియర్ ఎన్టీఆర్​తో చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. అది ‘షోలే’లా చాలా భారీ రేంజ్ లో ఉండాలి. అలాంటి స్టోరీ కోసం మేమూ ఎదురు చూస్తున్నాం. గతంలో ఇద్దరు, ముగ్గురు మా కోసం స్టోరీలు చెప్పారు కానీ, ఏదీ వర్కవుట్‌ కాలేదు. భవిష్యత్‌లోనైనా కుదురుతుందేమో చూడాలి” అన్నారు బాలయ్య.