Chiranjeevi – Balakrishna: అభిమానం పిచ్చి పీక్స్‌కి.. డల్హాస్‌లో రెచ్చిపోయి కొట్టుకున్న బాలయ్య, చిరు ఫ్యాన్స్

|

Jan 03, 2023 | 8:44 PM

చక్కగా సాగిపోతున్న ఎపిసోడ్‌లో చిచ్చు పెట్టింది ఇతనే. పేరు కేసీ చేకూరి. అభిమానం ముసుగులో ప్రశాంతంగా సాగుతున్న పార్టీలో అగ్గిరాజేశాడు. డల్హాస్‌లో ప్రవాసాంధ్రులంతా కలసి న్యూ ఇయర్ సెల్రబేషన్స్ చేసుకున్నారు.

Chiranjeevi - Balakrishna: అభిమానం పిచ్చి పీక్స్‌కి.. డల్హాస్‌లో రెచ్చిపోయి కొట్టుకున్న బాలయ్య, చిరు ఫ్యాన్స్
Chiranjeevi, Balakrishna
Follow us on

హీరోల ఫ్యాన్స్‌ ఊరమాస్ లొల్లి.. గల్లీలో జరిగింది కాదు. అమెరికాలోని డల్హాస్‌లో ప్రవాసాంధ్రులంతా కలసి న్యూ ఇయర్ సెల్రబేషన్స్‌లో చేసిన రచ్చ. అభిమానం పిచ్చి పీక్స్‌కి వెళ్లి కొట్లాట నుంచి అరెస్ట్ దాకా వెళ్లింది. చక్కగా సాగిపోతున్న ఎపిసోడ్‌లో చిచ్చు పెట్టింది ఇతనే. పేరు కేసీ చేకూరి. అభిమానం ముసుగులో ప్రశాంతంగా సాగుతున్న పార్టీలో అగ్గిరాజేశాడు. డల్హాస్‌లో ప్రవాసాంధ్రులంతా కలసి న్యూ ఇయర్ సెల్రబేషన్స్ చేసుకున్నారు. తగ్గేదే లే పేరుతో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కి చాలామంది తెలుగువాళ్లు అటెండ్ అయ్యారు. అయితే ఈవెంట్‎లో బాలకృష్ణ పాటలు వేసి.. జై బాలయ్య నినాదాలతో నందమూరి అభిమానులు సందడి చేశారు. ఆ క్రమంలోనే మెగా అభిమానులు చిరంజీవి, పవన్ పాటలు వేయాలని నినదించారు. అప్పుడే కేసీ చేకూరి ఓవరాక్షన్‌ గొడవకు ఆజ్యం పోసింది.

మెగా అభిమానులు గట్టిగా అరుపులు కేకలు వేస్తుంటే.. కేసీ చేకూరి తట్టుకోలేకపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ వాళ్లందరితో వాగ్వాదానికి దిగాడు. చిరంజీవి పాట వేసేదేలే.. ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండని రెచ్చగొట్టాడు. అక్కడితో ఆగకుండా బ్యానర్లు చించేసి శాడిజాన్ని ప్రదర్శించాడు. కేసీ చేకూరి వీరంగంతో మెగా అభిమానులు తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఈవెంట్‌ మేనేజర్లపైనా పిడిగుద్దులు కురిపించాడు కేసీ చేకూరి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసుల్ని ఆశ్రయించారు ఈవెంట్ మేనేజర్లు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కేసీ చేకూరిని అరెస్ట్‌ చేశారు.

కేసీ చేకూరి కేవలం మెగా ఫ్యాన్స్‌ నినాదాలు తట్టుకోలేకే దాడికి దిగాడా..? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? దేశంకాని దేశంలో మనవాళ్లు ఉన్నారంటే వాళ్లతో ఎలా ఉండాలి? మన అన్న సోయి మరిచి ప్రవర్తిస్తే ఎలా? ఇలాంటి పనులు చేస్తే హీరోలు స్వాగతిస్తారా? చేకూరి మోటివ్ ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. డల్లాస్ పోలీసుల అదుపులో ఉన్న కేసీ చేకూరిని విడిపించేందుకు కొంతమంది పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్‌తో రాజీ చర్చలు జరుపుతున్నారట. వేర్వేరు వేదికలపై తామంతా ఒక్కటేనని హీరోలు చెబుతుంటారు. ఫ్యాన్స్ మాత్రం ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే జరిగిన గొడవకు కారణం కేసీ చేకూరి అత్యుత్సాహమే అంటున్నారు అక్కడున్న వాళ్లంతా. ఆవేశానికి పోయి అమర్యాదగా ప్రవర్తించి పరువు తీసుకున్నాడని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి