AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda: బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న ‘అఖండ’.. కంటిన్యూ అవుతున్న కలెక్షన్స్

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ.. కరోనా తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా బాలయ్య అఖండ.

Akhanda: బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న 'అఖండ'.. కంటిన్యూ అవుతున్న కలెక్షన్స్
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2021 | 1:31 PM

Share

Akhanda: నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ.. కరోనా తర్వాత గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా బాలయ్య అఖండ. ఈ సినిమా ఊహించని రీతిలో విజయాన్ని సాంతం చేసుకొని కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. సింహ , లెజెండ్ సినిమాలను మించి అఖండ .. అఖండ విజయం సాధించింది. రోజులు గడుస్తున్నా థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు మాత్రం తీయడం లేదు ఓనర్స్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లోనూ అఖండ జాతర జరుగుతుంది అంటున్నారు బాలయ్య అభిమానులు. కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. బోయపాటి ఇచ్చిన మాస్ స్ట్రోక్‌కు.. ఒక్క బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అందుకే అఖండ విజయాన్ని కట్టబెట్టారు.

రాష్ట్రాలలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా 11 రోజుల్లో 17.36 కోట్ల షేర్ ను రాబట్టిందని అంటున్నారు.  నైజామ్ లో ఈ సినిమా 10.50 కోట్ల బిజినెస్ ను జరుపుకోగా, నిన్నటివరకూ రాబట్టిన షేర్ 17.36 కోట్లని వెల్లడించారు. రెమ్యూనరేషన్స్ కలుపుకుని ఈ మూవీకి రూ. 53 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే 8 రోజుల్లోనే టార్గెట్ కంప్లీట్ చేసి.. బ్రేక్ ఈవెన్‌లోకి దూసుకెళ్లింది అఖండ. ఇక ఏపీలో బెనిఫిట్ షోలపై, టికెట్ రేట్లపై నియంత్రణ ఉంది కానీ.. లేదంటే కథ వేరేలా ఉండేది అన్నది బాలయ్య ఫ్యాన్స్ వెర్షన్. మొత్తం మీద బాలయ్య ‘అఖండ’తో సింహనాదం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్