
తెలంగాణ మట్టి పరిమళాలను వెండితెరపై వెదజల్లుతూ ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ తెరకెక్కించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ వెంటకేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించారు. ఆయన కుమార్తె హర్షిత, కుమారుడు హన్షిత్ నిర్మాతలుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ధమాకాతో అందరి దృష్టిని అందుకున్న భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న బలగం చిత్రం ఇవాళే (మార్చి 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రివ్యూషోస్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కమెడియన్ వేణుకు మొదటి సినిమా అయినా తెలంగాణ మనుషుల స్వచ్ఛతను సిల్వర్ స్ర్కీన్‌పై చక్కగా చూపించాడంటూ పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారని రివ్యూలు వస్తున్నాయి. కాగా బలగం సినిమాను మరికొంతమందికి చేరువ చేసేందుకు మూవీ టికెట్స్‌పై ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో బలగం మూవీ టికెట్ ధరను 112 రూపాయలుగా నిర్ణయించారు. అయితే విడుదలైన మొదటి రోజు (మార్చి 3) అంటే ఈరోజు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మూవీ యూనిట్ పేర్కొంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ ఆఫర్ క్లోజ్ అవుతుందన్న మాట. సో.. తక్కువ ధరకు మంచి ఎమోషన్స్ ఉన్న మూవీని చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే బలగం సినిమా టికెట్లను బుక్ చేసుకోండి మరి.
ఇదిలా ఉంటే పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట సరికొత్త ఆఫర్‌ను ప్రకటించి యశ్ రాజ్ సంస్థ. మార్చి 3, 4, 5 తేదీల్లో పఠాన్ ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది.
పఠాన్ కోడ్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లోనూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు.
Takkuva prices lo manchi experience iche cinema ?❤️
Book your tickets now for only Rs. 112 at any multiplex across AP/Telangana on march 3rd.#Balagam ✨
?️ https://t.co/cMVIotYtzt
?️ https://t.co/7K1s2GXimZ#BalagamOnMarch3rd @offlvenu @priyadarshi_i @kavyakalyanram pic.twitter.com/tKMCBBfi3K— Dil Raju Productions (@DilRajuProdctns) March 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..