AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar 2024: ఆస్కార్ బరిలో బలగం.. దసరా.. అధికారిక ఎంట్రీ కోసం పోటీలో ఉన్న చిత్రాలు ఇవే..

ఆస్కార్ అవార్డ్ కోసం భారత్ నుంచి సినిమాలను పంపే ప్రక్రియ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరానికి గానూ ఆస్కార్ అవార్డ్ కోసం సినిమాలను పంపేందుకు ప్రత్యేకంగా ఓటీమ్ ఏర్పాటైనట్లు తెలుస్తోంది. గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నైలో సినిమాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారిక ఎంట్రీ కోసం దాదాపు 22 సినిమాలు వచ్చాయిని టాక్.

Oscar 2024: ఆస్కార్ బరిలో బలగం.. దసరా.. అధికారిక ఎంట్రీ కోసం పోటీలో ఉన్న చిత్రాలు ఇవే..
Balagam, Dasara
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2023 | 8:56 PM

Share

ఆర్ఆర్ఆర్.. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రత్యేకం. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఈ సినిమా చిరస్మరణీయ ముద్రవేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ నటకు భారతీయులే కాదు.. విదేశీయులు సైతం ముగ్దులయ్యారు. అలాగే ఈ చిత్రంలోని మ్యూజిక్ కు కాలు కదిపారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పుడు తెలుగువారి ఆస్కార్ ఆశలను సజీవమయ్యాయి. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలుపుతో ఇప్పుడు మన దేశం నుంచి సినిమాలను పంపించేందుకు పోటీ పడుతున్నారు మేకర్స్. ఆస్కార్ అవార్డ్ కోసం భారత్ నుంచి సినిమాలను పంపే ప్రక్రియ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరానికి గానూ ఆస్కార్ అవార్డ్ కోసం సినిమాలను పంపేందుకు ప్రత్యేకంగా ఓటీమ్ ఏర్పాటైనట్లు తెలుస్తోంది. గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నైలో సినిమాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారిక ఎంట్రీ కోసం దాదాపు 22 సినిమాలు వచ్చాయిని టాక్.

అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా.. అలాగే చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా బలగం. ఈ రెండు చిత్రాలు ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక హిందీ నుంచి ది స్టోరీ టెల్లర్, మ్యూజిక్ స్కూల్, మిస్ ఛటర్జీ వెర్సస్ నార్వే , 12th ఫెయిల్ చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవే కాకుండా.. గదర్ 2, ఘుర్, అబ్ తో సబ్ భవగాన్ భరోసే, రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాగే తమిళ్ చిత్రాలు విడుదలై 1, మరాఠీ నుంచి వాల్వి, బాప్ లాయక్ చిత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలన్నింటిని వీక్షించిన తర్వాత ఆస్కార్ అవార్డ్ కోసం భారత్ తరుపున ఎంపిక చేయనున్నారు. అయితే వీటిల్లో ఇప్పటికే పలు చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అలాగే ప్రేక్షకుల హృదయాలను తాకిన చిత్రాలు.. బలగం, జ్విగాటో చి్తరాలు ఆస్కార్ ఎంట్రీ సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.