Chiranjeevi: చిరంజీవిపై విమర్శలు.. శునకానందం పొందటం వారికి అలవాటేనన్న ప్రముఖ నిర్మాత

‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. 'రామ్ చరణ్‌కు అబ్బాయి పుడితే బాగుండు' అంటూ చిరంజీవి సరదాగా చెప్పిన మాటలను కొందరు పెడర్థాలు తీసిఆయనను ట్రోల్ చేస్తున్నారు.

Chiranjeevi: చిరంజీవిపై విమర్శలు.. శునకానందం పొందటం వారికి అలవాటేనన్న ప్రముఖ నిర్మాత
Chiranjeevi

Updated on: Feb 14, 2025 | 6:58 PM

బ్రహ్మ ఆనందం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
‘మా ఇంట్లో ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేను లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈసారైనా రామ్ చరణ్ కు బాబు పుడితే బాగుండు’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. చిరంజీవి తన కుటుంబ వారసత్వం వ్యాఖ్యలపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. స్టార్‌ హీరో అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని కామెంట్స్‌ చేశారు. మరోవైపు
చిరంజీవి సరదాగా అన్న మాటలకు పెడర్థాలు తీసి ఆయనపై విమర్శలు గుప్పించడం సరికాదంటున్నారు. తాజాగా ఇదే విషయంపై బేబీ సినిమా నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ ఒక సంచలన పోస్ట్ పెట్టారు. చిరంజీవిపై విమర్శలు వేస్తోన్న వేళ ఆయన మంచి మనసు గురించి తెలియజేస్తూ ఎస్‌ కే ఎన్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది ….నిండైన ఫామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు’ అంటూ చిరంజీవిని విమర్శిస్తోన్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఎస్ కే ఎన్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

 

నిర్మాత ఎస్ కే ఎన్ ట్వీట్..

తండేల్ పైరసీపై ఎస్కేఎన్ కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.