బాహుబలి ప్రభాస్‌ క్రేజ్‌కి షాక్.. జపాన్‌లో సీన్ రివర్స్

ఒక్క దేశంలో మాత్రం ప్రభాస్‌కి సీన్ రివర్స్ అయింది. అదే జపాన్‌లో. అక్కడ మాత్రం బాహుబలి చిత్రంలో అనుష్క బావ కుమార వర్మ పాత్రను పోషించిన సుబ్బరాజు క్రేజ్..

బాహుబలి ప్రభాస్‌ క్రేజ్‌కి షాక్.. జపాన్‌లో సీన్ రివర్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 27, 2020 | 2:17 PM

‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్‌ సంపాదించుకుందో తెలిసిన విషయమే. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని భాషల్లో రిలీజ్ అయి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. బాహుబలితోనే అటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కూడా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగాడు. ఆ తరువాత మళ్లీ ‘సాహో’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా.. అదికూడా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. కాగా కేవలం ప్రభాస్‌కే కాకుండా ఆ సినిమాలో నటించిన రానా, అనుష్క కూడా మంచి స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్నారు.

అయితే.. ఒక్క దేశంలో మాత్రం ప్రభాస్‌కి సీన్ రివర్స్ అయింది. అదే జపాన్‌లో. అక్కడ మాత్రం బాహుబలి చిత్రంలో అనుష్క బావ కుమార వర్మ పాత్రను పోషించిన సుబ్బరాజు క్రేజ్ ఒక రేంజ్‌లో వెలిగింది. తాజాగా.. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా జపాన్‌లో అతని ఫ్యాన్స్.. సుబ్బరాజు పేరుతో అమేజింగ్ ఫొటో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. అతని ఫొటోలకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా కుమార వర్మ గెటప్‌తోనే ఓసారి జపనీయులను పలకరించాడు మన సుబ్బరాజు.