Sathyaraj: సత్యరాజ్ హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్నారంటూ శుభవార్త చెప్పిన కట్టప్ప కుమారుడు..

దేశంలో కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. గత కొద్దిరోజులుగా కరోనా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న

Sathyaraj: సత్యరాజ్ హెల్త్ అప్డేట్.. కోలుకుంటున్నారంటూ శుభవార్త చెప్పిన కట్టప్ప కుమారుడు..
Sathyaraj

Updated on: Jan 11, 2022 | 10:36 AM

దేశంలో కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. గత కొద్దిరోజులుగా కరోనా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటు సినీ పరిశ్రమ పై సైతం కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పలువురు తారలు ఓమిక్రాన్, కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, శోభన, రాజేంద్రప్రసాద్, త్రిష, ఇషా చావ్లా, సత్యరాజ్ వంటి స్టార్స్ కోవిడ్ బారిన పడ్డారు. అయితే ప్రముఖ నటుడు సత్యరాజ్ కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కోలుకుంటున్నారంటూ శుభవార్త చెప్పారు సత్యరాజ్ తనయుడు.

సత్యరాజ్ కుమారుడు సిబి సత్యరాజ్ ఈరోజు ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో కట్టప్ప ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని.. నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇంట్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి తన వర్క్ ప్రారంభిస్తాడని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, అప్యాయతకు సిబి సత్యరాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించినవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..