
క్రిస్మస్ కానుకగా గురువారం (డిసెంబర్ 25) పలు కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టాయి. దండోరా, ఛాంపియన్, శంభాలా, ఈషా, పతంగి, దండోరా సినిమాలతో పాటు వృషభ అనే ఓ మలయాళ డబ్బింగ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అయిదే ఇదే సమయంలో తాజాగా వచ్చిన చిత్రం కూడా ఆడియన్స్ చేత కన్నీరు పెట్టిస్తోంది. ఆ మధ్యన తెలుగులో వచ్చిన బలగం సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవార్డులు, ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక థియేటర్లలో బలగం సినిమాను చూసి జనాలు ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అఅలాంటి సీన్లే ఓ సినిమా థియేటర్ దగ్గర కనిపిస్తున్నాయి. క్రిస్మస్ కానుకగా తమిళంలో ఒక సినిమా రిలీజైంది.కేవలం తమిళ్ భాషలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్ ప్రభు నటించిన లేటెస్ట్ సినిమా సిరై. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ దర్యాప్తు, ఖైదీల విచారణ నేపథ్యంలో ఎమోషనల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కులం, మతం ఆధారంగా మైనారిటీలను మన సమాజం, న్యాయవ్యవస్థ ఎలా చూస్తుందనే విషయాన్ని ఇందులో చూపించారు. ఘాటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన విక్రమ్ ప్రభు ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో అదరగొట్టాడు.అనిష్మా, అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది. జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలు, బీజీఎమ్ సిరై సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి.
#Sirai Audience getting emotional after watching the film in theatre ♥️👍
SIRAI 👍👍👍 pic.twitter.com/ZtUNpJDUtl
— Karthik Ravivarma (@Karthikravivarm) December 25, 2025
cricketer @ashwinravi99 watched and spoke highly about #Sirai. After loads of appreciation from the industry and media, the film comes to theatres…
#Vikramprabhu #sdcworld pic.twitter.com/LHXFo3cPBF
— SDC World (@sdcworldoffl) December 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి