Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ సినిమా చూసేందుకు పరదాలో వచ్చిన అభిమానులు.. వీడియో వైరల్.. ఎందుకో తెలుసా?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హరి హర వీరమల్లు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు గురువారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా చూసేందుకు కొందరు అభిమానులు పరదాలో రావడం చర్చనీయాంశమైంది.

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ సినిమా చూసేందుకు పరదాలో వచ్చిన అభిమానులు.. వీడియో వైరల్.. ఎందుకో తెలుసా?
Hari Hara Veera Mallu Movie

Updated on: Jul 24, 2025 | 8:37 PM

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరి హరి వీరమల్లు ఇవాళ థియేటర్లలో రిలీజైది. ఎప్పటిలాగే బుధవారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పవన్ అభిమానుల హంగామా మొదలైంది. థియేటర్ల బయట బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. భారీ కటౌట్లు, పోస్టర్లకు పాలాభిషేకం చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌ వద్ద ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు వచ్చిన కొందరు మహిళలు విభిన్నమైన వేషధారణలో థియేటర్ కు వచ్చారు. తమ చీరను తలకు పరదాలాగా కప్పుకుని సందడ చేశారు.
రెడ్ కలర్ శారీలో వచ్చిన వీరు.. సినిమా స్టార్ట్ అయ్యాక కూడా తమ మొహాలు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీరంతా ఎందుకిలా థియేటర్ కు వచ్చారని చర్చించుకుంటున్నారు.

అయితే ఇదంతా అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా కోసమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇలా పరదాల కప్పుకుని పవన సినిమాకు వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఐడియా అద్దిరిపోయిందని.. పవన్ సినిమా థియేటర్లలో తమ మూవీ ప్రమోషన్ చేసుకుంటే ఇంకా హైప్ పెరుగుతుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. కాగా పరదా సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాబీ డియోలో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్నాడు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.

  హరి హర వీరల్లు  రిలీజ్ తర్వాత అభిమానుల ముందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..