Aswani Dutt: “చిరంజీవి-రజినీకాంత్- శ్రీదేవితో ఆ సినిమా చేయాలనుకున్నా.. కానీ”.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్

|

Aug 16, 2022 | 5:51 PM

నాటి నుంచి నేటి వరకు మంచి సినిమాలు తీస్తారనే పేరున్న అశ్వినీదత్.. తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆ ట్యాగ్‌ను కాపాడుకుంటూనే సినిమాలు తీస్తున్నారు.

Aswani Dutt: చిరంజీవి-రజినీకాంత్- శ్రీదేవితో ఆ సినిమా చేయాలనుకున్నా.. కానీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్
Ashwini Dutt
Follow us on

నాటి నుంచి నేటి వరకు మంచి సినిమాలు తీస్తారనే పేరున్న అశ్వినీదత్(Aswani Dutt).. తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆ ట్యాగ్‌ను కాపాడుకుంటూనే సినిమాలు తీస్తున్నారు. మధ్యలో భారీ ప్లాపులతో కాస్త తడబడినా కూడా… తన కూతరు స్వప్న.. అల్లుడు నాగ్‌ అశ్విన్‌ ఆధ్వర్యంలో… వైజయంతీ మూవీస్‌ను మరోసారి చాలా బలంగా నిలబడేలా చేశారు. ఈ సారి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లకు చేయూత నిస్తూ… సూపర్ డూపర్ హిట్లను కొట్టేస్తున్నారు. దాంతో పాటే.. తన అల్లుడు నాగ్‌ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ ప్రాజెక్ట్ K చేస్తున్నారు. ప్రభాస్ కటౌట్తో మరో వండర్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

ఇక తాజాగా సీతారామం సినిమాతో… మరో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న వైజయంతీ అశ్వినీదత్.. తాజాగా అప్పటి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇద్దరు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు చిరంజీవి, రజినీ కాంత్‌ ను కలిపి అప్పట్లో రంగీలా సినిమా చేయాలనకున్న విషయాన్ని చెప్పి అందర్నీ షాక్ చేశారు. శివ సినిమా సూపర్ డూపర్ హిట్‌తో అప్పట్లో ఊపుమీదున్న ఆర్జీవీని.. తన బ్యానర్లో సినిమా చేయాలని రిక్వెస్ట్ చేశారట అశ్వినీదత్. అందుకు ఆర్జీవీ.. తన దగ్గరున్న ‘రంగీలా’, గోవింద..గోవింద కథలు చెప్పారట. అయితే రంగీలా సినిమాలో చిరంజీవి, రజినీ కాంత్‌ చేస్తే.. బాగుంటుందని కూడా ఇద్దరూ అనుకున్నారట. కాని ఈ సినిమా కోసం ఇద్దరిని ఒప్పించడం చాలా కష్టమవుతుందని ఫీలైన అశ్వినీదత్… మరో కథ గోవింద గోవింద ను కాస్త అయిస్టంగానే ఓకే చేశారట. ఆర్జీవీతో తెరకెక్కించారట. ఇక ఇదే విషయాన్ని ఇన్నాళ్లకు బయటపెట్టిన ఈ స్టార్ ప్రొడ్యూసర్… ఈ వీడియోతో నెట్టింట వైరల్‌ అవుతున్నారు. మంచి కాంబో మిస్సైందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.