ఘనంగా ఆర్య, సాయేషా వివాహం

తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా సైగల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహానికి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ వేదికైంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా సంగీత్ ఘనంగా జరిగింది. హీరో అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్య, సాయేషాలకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీత్‌లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను ఆర్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీ చేయి విడవను అంటూ ట్వీట్ […]

ఘనంగా ఆర్య, సాయేషా వివాహం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:05 PM

తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా సైగల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహానికి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ వేదికైంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా సంగీత్ ఘనంగా జరిగింది. హీరో అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆర్య, సాయేషాలకు శుభాకాంక్షలు తెలిపారు.

సంగీత్‌లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫొటోలను ఆర్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీ చేయి విడవను అంటూ ట్వీట్ చేశారు. గజనీకాంత్ సినిమా కోసం ఆర్య, సాయేషా తొలిసారి కలిసి పనిచేశారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తరువాత ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి కాప్పన్ చిత్రంలో నటిస్తున్నారు.