
ఇండస్ట్రీలో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరో లుగా, హీరోయిన్ లుగా మారారు. అంతే కాదు వీరిలో కొంత మంది అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఒకటి రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకున్నారు. అలా ప్రేక్షకులు ఇప్పటికి కూడా మర్చిపోలేని గుత్తిమాపును సొంతం చేసుకున్న ఆర్టిస్ట్ లలో అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి ఒకరు. ఆ చిన్నారి పేరు దివ్య నగేష్.
అరుంధతి సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్య నగేష్. అరుంధతి సినిమా దివ్య నగేష్ కు తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా గా నిలిచిపోయింది. అరుంధతి సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు .మొన్నామధ్య హీరోయిన్ గా దివ్య నగేష్ మలయాళంలో పలు సినిమాలు చేసింది. అలాగే తెలుగులో నేను నాన్న అబద్దం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.