Rajamouli: రాజమౌళి సక్సస్‌కు కారణం అదే.. ఆసక్తికర విషయం చెప్పిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్
హాలీవుడ్ దర్శకులు కూడా ఆశ్చర్యపోయేలా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు రాజమౌళి. ఇప్పుడు సర్వత్రా ఆయన పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా తారలు, పలువురు ప్రముఖులు రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడంతో తెలుగు ప్రజల గుండెలు గర్వంతో నిండిపోయాయి. హాలీవుడ్ దర్శకులు కూడా ఆశ్చర్యపోయేలా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించి శబాష్ అనిపించుకున్నారు రాజమౌళి. ఇప్పుడు సర్వత్రా ఆయన పై ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా తారలు, పలువురు ప్రముఖులు రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి మనకు డైరెక్టర్ గానే తెలుసు.. అది సీరియల్స్ వల్ల అయితేనేమీ.. సినిమా వల్ల అయితేనేమీ! లెక్కల ప్రకారమే సినిమాలు తీస్తారని తెలుసు.. అది తన సినిమాల కలెక్షన్స్ వల్ల అయితే నేమీ.. కొట్టే రికార్డుల వల్ల అయితేనేమీ.. బుల్లి తెరమీద నంచి.. వెండితెర మీదికి వెళ్లిన జక్కన్న.. అక్కడ సెంట్ పర్సెంట్ సక్సెస్ సాధించారు. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తనకే సాధ్యమైన లార్జన్ దెన్ లైఫ్ సినిమాలతో.. పాన్ ఇండియన్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సాబు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ రాజమౌళి గురించి ఆసక్తికర విషయం తెలిపారు.
సాబు సిరిల్ మాట్లాడుతూ.. రాజమౌళి.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనుడు. దర్శకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఎలాంటి కథనైనా తనదైన శైలిలో సినిమాగా మలిచి సక్సెస్ అయ్యాడు రాజమౌళి. సినిమాను చెక్కి చెక్కి అద్భుతంగా తెరకెక్కిస్తారు రాజమౌళి అందుకే ఆయనను జక్కన్న అని పిలుస్తుంటారు. రాజమౌళి సినిమా తెరకెక్కించే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కథను ముందుగా సీన్ టు సీన్ ఆయన నటించి.. ఆ భావాలను ఎలా పలకాలో.. ఎమోషన్ ను ఎలా చేయాలో చేసి చూపించి. నటి నటుల నుంచి అదే రిజల్ట్ ను రాబడుతుంటారు అని అన్నారు.
రాజమౌళి దేనినైనా నిజం అనుకునేలా తెరకెక్కిస్తారు. నమ్మలేని విషయాలను కూడా తన సినిమాలో నిజం అనేలా చూపిస్తారు రాజమౌళి. ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ బైక్ ను చేతులతో పైకి లేపుతాడు. నిజానికి అది ఎంతో కష్టమైనది అందరికి సాధ్యం కానిది. కానీ సినిమా చూస్తుంటే మనకు అలా అనిపించదు. నిజంగానే ఎన్టీఆర్ బైక్ ను పైకి లేపాడు అనే భావన కలుగుతుంది.. అలా నమ్మిస్తాడు మనల్ని అని అన్నారు. అలాగా ఆయన ఎంత డేడికేటెడ్ డైరెక్టర్ అంటే అందరు నిద్రపోయిన తర్వాత ఆయన నిద్రపోతాడు.. అలాగే ఉదయాన్నే 4.30కు లేచి రెడీ అయ్యి సెట్ కు వచ్చేస్తాడు అని అన్నారు సాబు. అలాగే ఆయన ఎవరు ఏ సలహా ఇచ్చిన కూడా తీసుకుంటాడు. నాకు తెలిసి రాజమౌళి సక్సెస్ కు కారణం.. ఆయన సినిమా కథలో బాగా ఇన్వాల్వ్ అవ్వడమే అని అన్నారు సాబు. సినిమాలోని ప్రతి డిపార్ట్ మెంట్ లో రాజమౌళి ఇన్వాల్వ్ అవుతారు. రాజమౌళితో బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు చేయడం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు సాబు.




