
ఒక స్టార్ హీరోకు సోదరుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా గా కాకున్నా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు డైరెక్టర్ గా, నిర్మాతగానూ సత్తా చాటాడు. హిందీతో పాటు తెలుగు, ఉర్దూ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేశాడు. ఇదే క్రమంలో ఒక ప్రముఖ నటిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి సుమారు 19 ఏళ్లు కాపురం చేశారు. వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక బిడ్డ కూడా వీరి జీవితంలోకి అడుగు పెట్టాడు. అయతే అనూహ్యంగా వీరి దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తలుగా కలిసుండలేమని పరస్పరం అనుమతితో విడాకులు తీసుకుని విడిపోయారు. 2017లో తన భార్యతో విడిపోయిన ఈ స్టార్ హీరో సుమారు ఆరేళ్లు ఒంటరిగానే లైఫ్ లీడ్ చేశాడు. ఇదే క్రమంలో మరో నటితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో కలిసి రెండో సారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు రెండో భార్య గర్భం దాల్చింది. దీంతో 57 ఏళ్ల వయసులో రెండో సారి తండ్రి కానున్నాడీ ఫేమస్ యాక్టర్. అతను మరెవరో కాదు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్.
నటి మలైకా అరోరాతో విడాకులు తీసుకున్న తర్వాత, అర్బాజ్ ఖాన్ చాలా ఏళ్లు ఒంటరి జీవితాన్ని గడిపాడు. అయితే డిసెంబర్ 2023లో, అతను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ తమ జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు వివాహం అయిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, షురా శుభవార్త చెప్పింది. త్వరలో ఖాన్ కుటుంబంలో మరొక మెంబర్ చేరనున్నాడు. గత కొన్ని నెలలుగా షురా ఖాన్ గర్భంతో ఉందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ వారిద్దరూ దానిపై స్పందించలేదు. ఇప్పుడు షురా గర్భంతో ఉందని క్లారిటీ వచ్చింది.
మంగళవారం, ముంబైలోని ఒక దుకాణం వెలుపల షురా కనిపించింది. ఈసారి, ఆమె ముదురు నీలం రంగు బాడీకాన్ డ్రెస్, దానిపై డెనిమ్ జాకెట్ ధరించింది. ఈ డ్రెస్ లో, ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ విషయమై ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా స్పందించలేదు. 1998లో మలైకాను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వారు కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయారు.
షురా ఖాన్ కు కూడా సినిమా పరిశ్రమతో అనుబంధం ఉంది. ప్రముక బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడానీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు షురా ఖాన్. ఇక అర్బాజ్ ఖాన్ జై చిరంజీవ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..