Vijay’s Beast: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విజయ్ బీస్ట్(Beast) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్(pooja hegde)గా నటిస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. తమిళ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత బీస్ట్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రేమికుల రోజు( ఫిబ్రవరి 14న ) సందర్భంగా బీస్ట్ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఓ అందమైన మెలోడీని రిలీజ్ చేయనున్నారు. బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ విజయ్‌కు సంబంధించిన సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే.. లవర్స్ డే రోజు విడుదల చేసే పాట కోసం ప్రోమోను సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ ప్రోమో ఏకంగా 6 నిముషాలు చేశారు.. కానీ పాట మాత్రం 4 నిమిషాలే ఉంటుందని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమో కోసం మరో స్టార్ హీరో శివకార్తికేయను కూడా రంగంలోకి దింపారు.. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి ..
మరిన్ని ఇక్కడ చదవండి :