AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay’s Beast: ప్రమోషన్స్ షురూ చేసిన బీస్ట్ టీమ్.. అరబిక్ సాంగ్‌తో అదరగొట్టనున్న అనిరుద్

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్.

Vijay's Beast: ప్రమోషన్స్ షురూ చేసిన బీస్ట్ టీమ్.. అరబిక్ సాంగ్‌తో అదరగొట్టనున్న అనిరుద్
Vijay
Rajeev Rayala
|

Updated on: Feb 08, 2022 | 2:54 PM

Share

Vijay’s Beast: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను సాధిస్తుంటాయ్. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.. ప్రతి సినిమా 100కోట్ల మార్క్ ను చాలా సింపుల్ గా క్రాస్ చేసేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు విజయ్ బీస్ట్(Beast) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్(pooja hegde)‏గా నటిస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. తమిళ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత బీస్ట్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ప్రేమికుల రోజు( ఫిబ్రవరి 14న ) సందర్భంగా బీస్ట్ సినిమానుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఓ అందమైన మెలోడీని రిలీజ్ చేయనున్నారు. బీస్ట్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ విజయ్‏కు సంబంధించిన సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే జార్జియా, చెన్నై సహా పలు ప్రాంతాల్లో 100 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇది పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.. రాజకీయ నేపథ్యం హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే.. లవర్స్ డే రోజు విడుదల చేసే పాట కోసం ప్రోమోను సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ ప్రోమో ఏకంగా 6 నిముషాలు చేశారు.. కానీ పాట మాత్రం 4 నిమిషాలే ఉంటుందని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమో కోసం మరో స్టార్ హీరో శివకార్తికేయను కూడా రంగంలోకి దింపారు.. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి ..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nora Fatehi: పుట్టినరోజున అదిరిపోయే బహుమతి అందించిన అభిమానులు.. భావోద్వేగానికి గురైన బాలీవుడ్‌ బ్యూటీ..

Shanmukh Jaswanth: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యూట్యూబ్‌ స్టార్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

AP High Court: థియేటర్లను సీజ్ చేయడంపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం.. ఆ అధికారం వారికి లేదంటూ..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్