Kaikala Satyanarayana: నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ బులెటిన్ విడుదల.. పరిస్థితి మరింత విషమం..

Kaikala Satyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ఆయనకు

Kaikala Satyanarayana: నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ బులెటిన్ విడుదల.. పరిస్థితి మరింత విషమం..
Kaikala Satyanarayana

Updated on: Nov 20, 2021 | 7:48 PM

Kaikala Satyanarayana:  టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల సత్య నారాయణ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ” సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. జ్వరంతో ఈరోజు ఉదయం 7.30 నిమిషాలకు అపోలోలో చేరారు. కోవిడ్ తర్వాత సత్యనారాయణ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చికిత్సకు ఆశించినంత మేర స్పందించడం లేదు.. అని వైద్యులు తెలిపారు.

Kaikala

కైకాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నరాు. గత నెల 30న కూడా కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

1959 లో సిపాయి కూతురు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.

Also Read: కుక్క హెయిర్ డై కోసం లక్షలు ఖర్చు.. మోడల్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..