Pawan Kalyan: తెలంగాణ వరద బాధితులకు పవన్‌కల్యాణ్‌ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు మొత్తం 6 కోట్ల ఆర్థిక సాయం

|

Sep 04, 2024 | 3:27 PM

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీగా విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు వ్యక్తిగతంగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు పవన్ కల్యాణ్. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్ అందజేయనున్నారు పవర్ స్టార్

Pawan Kalyan: తెలంగాణ వరద బాధితులకు పవన్‌కల్యాణ్‌ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు మొత్తం 6 కోట్ల ఆర్థిక సాయం
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీగా విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు వ్యక్తిగతంగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు పవన్ కల్యాణ్. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి కోటి రూపాయల చెక్ అందజేయనున్నారు పవర్ స్టార్. ఇక బుధవారం (సెప్టెంబర్ 04) మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా మరో కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కోటి రూపాయల చెక్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేయనున్నట్లు పవన్ వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో సుమారు 400 పంచాయతీలు వరద బారిన పడ్డాయన్నడిప్యూటీ సీఎం ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపిన తర్వాత లక్ష చొప్పున ఆ 400 పంచాయతీలకు స్వయంగా తానే నేరుగా డబ్బు పంపిస్తానని ఆయన మీడియాతో తెలిపారు.

ఈ లెక్కన చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ మొత్తం 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లయ్యింది. కాగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన పవన్ తాను రంగంలోకి దిగితే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు తనకు నివేదించారన్నారు. అందుకే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనడం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

400 పంచాయతీలకు లక్ష చొప్పున విరాళం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.