Yatra 2 Movie: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. ‘యాత్ర 2’ నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్..

|

Dec 21, 2023 | 11:30 AM

ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును.. 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు డైరెక్టర్. ఈరోజు (డిసెంబర్ 21న) సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Yatra 2 Movie: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్..
Yatra 2 movie twitter review
Follow us on

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన సూపర్ హిట్ యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్‏గా డైరెక్టర్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘యాత్ర 2’. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్సార్ తనయుడు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరును.. 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు డైరెక్టర్. ఈరోజు (డిసెంబర్ 21న) సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడికుని” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ పోస్టర్ లో జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రను రివీల్ చేశారు. వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. డిసెంబర్ 9న వైఎస్ భారతి పుట్టినరోజు సందర్భంగా యాత్ర 2లో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకు రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడడం కూడా నేర్పించలేదు.’ అని డైలాగ్ రాసుకొచ్చారు.

గతంలో యాత్ర సినిమాను 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు యాత్ర 2 సినిమాను కూడా అదే రోజున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.