Breaking : కొనసాగుతున్న సినిమా కష్టాలు.. ఏపీలో మరో థియేటర్ సీజ్..

ఆంద్రప్రదేశ్‏లో సినిమా కష్టాలు తగ్గడం లేదు. ఓవైపు సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై సినీ ప్రముఖులకు.. ప్రభుత్వానికి

Breaking : కొనసాగుతున్న సినిమా కష్టాలు.. ఏపీలో మరో థియేటర్ సీజ్..

Edited By:

Updated on: Dec 27, 2021 | 6:56 PM

ఆంద్రప్రదేశ్‏లో సినిమా కష్టాలు తగ్గడం లేదు. ఓవైపు సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై సినీ ప్రముఖులకు.. ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులు పలువురు ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తుండగా… మరికొందరు తిరిగి పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న థియేటర్లపై కొరడా ఝులిపిస్తున్నారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న థియేటర్లను సీజ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు 100కు పైగా సినిమా హాళ్లకు నోటిసులు జారీ చేశారు. అలాగే మరికొన్నింటిని సీజ్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30కి పైగా సినిమా థియేటర్లను సీజ్ చేశారు అధికారులు.

ఇదిలా ఉంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంలో థియేటర్లను నడమలేమంటూ సినిమా హాళ్లను స్వచ్చందంగా క్లోజ్ చేస్తున్నారు నిర్వహకులు. గత రెండేళ్లుగా కరోనా వలన థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లకు జనాలు వస్తుండడం.. భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదలవుతుండడంతో నిర్వాహకులలో మళ్లి ఆశలు చిగురించాయి. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో పాస్ చేయడంతో థియేటర్స్ యాజమాన్యాలు , ప్రొడ్యూసర్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో మరో థియేటర్‏ను సీజ్ చేశారు అధికారులు. విజయనగరం జిల్లాలోని రామభద్రపురంలోని టీబీఆర్ థియోటర్ పై రెవెన్యూ సిబ్బంది దాడులు చేశారు. శ్యాం సింగరాయ్ సినిమా అడుతుండగా తనిఖీలు చేసిన అధికారులు.. థియేటర్ సీజ్ చేశారు. వైసీపీ నేత తూముల భాస్కరరావుకు చెందిన థియోటర్ సీజ్ చేయటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇక టికెట్ల వ్యవహారంపై మంత్రి పేర్ని నానితో ఆంధ్రా, సీమ డిస్ట్రిబ్యూటర్ల భేటీ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 20 మందితో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో టికెట్ల ధరలు తగ్గింపు, థియేటర్లలో తనిఖీలతో డిస్ట్రీబ్యూటర్లు ఆందోళన కొనసాగుతోంది.

Also Read: RRR Movie Pre Release Event Live: అంగరంగ వైభవంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. లైవ్‏లో చూసేయ్యండి..

RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..