Anushka Shetty: లండన్‌కు పయనమవుతున్న అందాల అనుష్క.. కారణం ఇదే

|

Nov 12, 2022 | 7:10 PM

ఆ సినిమా తర్వాత అనుష్క కొంత గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజులతర్వాత ఇప్పుడు ఓ సినిమాను ప్రకటించారు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జేజమ్మగా మారింది..

Anushka Shetty: లండన్‌కు పయనమవుతున్న అందాల అనుష్క.. కారణం ఇదే
Anushka
Follow us on

స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తర్వాత అనుష్క కొంత గ్యాప్ తీసుకున్నారు. చాలా రోజులతర్వాత ఇప్పుడు ఓ సినిమాను ప్రకటించారు. అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు జేజమ్మగా మారింది.. అలాగే.. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో దేవసేనగా అనుష్క నటన అద్భుతం. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. బాహుబలి 2 తర్వాత వెండితెరపై కనిపించలేదు. చాలాకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న స్వీట్.. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి సరసన నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సినిమాకు తానే హీరోగా కూడా మారిపోయి విజయాలు అందుకున్నారు ఈమె. విజయశాంతి తర్వాత టాలీవుడ్‌‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తీసుకొచ్చిన ఘనత మాత్రం స్వీటీ సొంతం. అరుంధతి నుంచి మొదలుపెడితే.. భాగమతి వరకు చాలా మాయ చేసారు జేజమ్మ.

తాజాగా అనుష్క లండన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ పయనమవనున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుందిసినిమాలో ఆమె అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపించనుంది.

యూవీ క్రియేషన్స్ లో ఇదివరకు అనుష్క చాలా సినిమాలే చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.