అందుకే ట్విట్ట‌ర్‌లో అడుగు పెట్ట‌లేదు : అనుష్క

విమెన్ ఓరియంటెడ్ సినిమాలంటే చాలు..ముందుగా అనుష్క‌నే గుర్తుకు వ‌స్తుంది. 'అరుంధతి, పంచాక్ష‌రి, 'బాహుబలి‌, సైజ్ జీరో, భాగ‌మ‌తి సినిమాల్లో ఆమె శ‌క్తివంత‌మైన పాత్ర‌లు పోషించింది.

అందుకే ట్విట్ట‌ర్‌లో అడుగు పెట్ట‌లేదు : అనుష్క
Follow us

|

Updated on: Aug 29, 2020 | 4:54 PM

విమెన్ ఓరియంటెడ్ సినిమాలంటే చాలు..ముందుగా అనుష్క‌నే గుర్తుకు వ‌స్తుంది. ‘అరుంధతి, పంచాక్ష‌రి, ‘బాహుబలి‌, సైజ్ జీరో, భాగ‌మ‌తి సినిమాల్లో ఆమె శ‌క్తివంత‌మైన పాత్ర‌లు పోషించింది. ఇప్ప‌టికీ టాలీవుడ్‌లో ఎవ‌రైనా ఫిమేల్ ఓరియంటెడ్ క‌థ‌లు రాసుకున్నారంటే మొద‌టిగా గుర్తొచ్చేది అనుష్క‌నే. అంతలా ఆమె పాత్ర‌ల్లో ఒదిగిపోయింది. ఇటీవ‌ల అనుష్క‌ కీలక పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ విడుదల కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, అనుష్క సోష‌ల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా మాత్ర‌మే వినియోగిస్తోంది. మరి ట్విట్టర్​లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తే.. ఆమె సమాధానం ఏంటో మీరే చ‌ద‌వండి. (తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు)

“‘నాక్కొంచెం బిడియం ఎక్కువ‌. సెట్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతా గానీ, కొత్తవాళ్లతో అంత త్వరగా క‌లిసిపోలేను. సినిమాలు లేకపోతే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటా. బయట సోసైటీలో విష‌యాల గురించి అస్స‌లు ప‌ట్టించుకోను. ఇక సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండటానికి ప్రత్యేక రీజ‌న్స్ లేవు. సమయం పెద్ద‌గా లేక‌పోవ‌డం వల్లే వాటికి దూరంగా ఉంటున్నా. ఫ్యాన్స్‌ ట్విట్టర్​లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నా.. రాక‌పోవ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం. నిజానికి ట్విట్ట‌ర్ గురించి నాకు పెద్ద‌గా అవగాహన కూడా లేదు. స‌మ‌యం దొరికిన‌ప్పుడు తప్పకుండా ట్విట్టర్​లో చేరతా. ఆ తర్వాత ఫ్యాన్స్ అంద‌రితో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటా” అంటూ చెప్పుకొచ్చింది అందాల అనుష్క‌.

Also Read :

ఏపీలోని ఆ ప్రాంతంలో రేపు సంపూర్ణ లాక్‌డౌన్

కడప జిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?