Anupama Parameswaran: తనలో ఉన్న మరో టాలెంట్ బయట పెట్టిన అనుపమ.. శబాష్ అంటున్న ఆడియన్స్

దక్షిణాది భాషలన్నింటిలో తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న అనుపమ ఇటీవల వరుసగా రెండు హిట్స్ అందుకుంది.

Anupama Parameswaran: తనలో ఉన్న మరో టాలెంట్ బయట పెట్టిన అనుపమ.. శబాష్ అంటున్న ఆడియన్స్
Anupama

Updated on: Apr 11, 2023 | 1:27 PM

టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటుంది. దక్షిణాది భాషలన్నింటిలో తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్న అనుపమ ఇటీవల వరుసగా రెండు హిట్స్ అందుకుంది. ఈ అమ్మడు నటించిన కార్తికేయ2 , 18 పేజెస్ సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. అలాగే బటర్ ఫ్లై అనే సినిమాలో నటించింది. అనుపమ నటిగానే కాక తనలో మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.

సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో డీఓపీగా మారి ఆశ్చర్య పరిచింది అనుపమ.ఈ షార్ట్ ఫిల్మ్‌ను చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

మంచి ఆఫర్స్.. వరుస హిట్స్ కూడా ఉన్న ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ చివరిగా బటర్‌ఫ్లై, క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించింది. సినిమాటోగ్రాఫర్ గా ఆమెకు విమర్శకుల నుండి చాలా ప్రశంసలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి