Anupama Parameswaran: టిల్లు స్వ్కేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అనుపమ అందుకే రాలేదా.. సిద్దూ కామెంట్స్ వైరల్..

|

Mar 28, 2024 | 10:53 AM

ఈ సినిమాలో అనుపమ గ్లామరస్ గా కనిపించి ఆభిమానులకు షాకిచ్చింది. లిప్ లాక్స్, హగ్గులతో రెచ్చిపోయింది. టీజర్‏తోనే ఊహించిన షాకిచ్చిన అనుపమ.. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత బోల్డ్ గా కనిపించింది. దీంతో ఇన్నాళ్లు ట్రెడిషనల్ రోల్స్ చేసిన తమ హీరోయిన్.. ఇప్పుడు ఇలాంటి సీన్స్ చేసిందేంటీ అని కోపంతో ఊగిపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తే తనకే నచ్చడం లేదని.. అందుకే కాస్త కొత్తగా ట్రై చేశానని చెప్పుకొచ్చింది.

Anupama Parameswaran: టిల్లు స్వ్కేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు అనుపమ అందుకే రాలేదా.. సిద్దూ కామెంట్స్ వైరల్..
Anupama, Siddu Jonnalagadda
Follow us on

అనుపమ పరమేశ్వరన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడున్న కుర్రాళ్ల ఆరాధ్య దేవత ఈ మలయాళీ కుట్టి. కానీ కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకేమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కొందరు. కానీ మరికొందరు మాత్రం ఆమె సోషల్ మీడియా ఖాతాలో నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. అనుపమ పై ఫ్యాన్స్ సీరియస్ కావడానికి కారణం టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో అనుపమ గ్లామరస్ గా కనిపించి ఆభిమానులకు షాకిచ్చింది. లిప్ లాక్స్, హగ్గులతో రెచ్చిపోయింది. టీజర్‏తోనే ఊహించిన షాకిచ్చిన అనుపమ.. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత బోల్డ్ గా కనిపించింది. దీంతో ఇన్నాళ్లు ట్రెడిషనల్ రోల్స్ చేసిన తమ హీరోయిన్.. ఇప్పుడు ఇలాంటి సీన్స్ చేసిందేంటీ అని కోపంతో ఊగిపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తే తనకే నచ్చడం లేదని.. అందుకే కాస్త కొత్తగా ట్రై చేశానని చెప్పుకొచ్చింది. అయినా ఫ్యాన్స్ కోపం మాత్రం చల్లారినట్లుగా లేదు. అనుపమ పోస్టర్స్ పై నెగిటవ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు.దీంతో టిల్లు స్వ్కేర్ ప్రమోషన్లలో అంతగా పాల్గొనలేదు అనుపమ.

ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‏కు సైతం అనుపమ డుమ్మా కొట్టింది. అయితే ఇదే కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్స్ పై గట్టిగానే కౌంటరిచ్చాడు. “ఫ్లర్టింగ్ అనేది అవతలి వాళ్లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఉండకూడదు. టిల్లు స్క్వేర్ నుంచి పోస్టర్ విడుదలైంది. దానికి కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అమ్మాయిలను అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ క్లాస్ తీసుకున్నాడు. దీంతో నెగిటవ్ కామెంట్స్ వల్ల అనుపమ హర్ట్ కావడంతోనే ప్రీ రిలీజ్ వేడుకకు రాలేదని తెలుస్తోంది.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై స్పీచ్ అనంతరం కొన్ని డైలాగ్స్ చెప్పి ఖుషీ చేశాడు. చివర్లో సుమ అడగడంతో కొన్ని స్టెప్పులు వేశాడు. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాగా..హైదరాబాద్ లో రూ. 83 లక్షల టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.అలాగే ప్రపంచవ్యాప్తగా ఈ చిత్రానికి భారీగానే బుకింగ్స్ జరిగినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.