Mohanlal : మోహన్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా ?.. అందానికి విస్మయం చెందాల్సిందే..

మన్యం పులి, ఇద్దరు, మాన్ స్టర్, జైలర్ చిత్రాల్లో నటించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోనూ కీలకపాత్ర పోషించారు మోహన్ లాల్. తనదైన నటనతో టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరైన మోహన్ లాల్ .. ఫ్యామిలీ గురించి మాత్రం అంతగా తెలియదు. తమిళ సినిమాల నిర్మాత కె. బాలాజీ కుమార్తె సుచిత్రను 1988లో వివాహం చేసుకున్నారు మోహన్ లాల్. వీరికి బాబు ప్రణవ్ మోహన్ లాల్, కూతురు విస్మయ మోహన్ లాల్ ఉన్నారు.

Mohanlal : మోహన్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా ?.. అందానికి విస్మయం చెందాల్సిందే..
Mohanlal
Follow us

|

Updated on: Mar 28, 2024 | 11:16 AM

మలయాళీ నటుడు మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. తెలుగులో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. నందమూరి బాలకృష్ణ, రోజా, అక్కినేని నాగేశ్వర్ రావు కలిసి నటించిన గాండీవం సినిమాలోని ఓ పాటలో అతిథిగా కనిపించారు. అలాగే ఆయన నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. మన్యం పులి, ఇద్దరు, మాన్ స్టర్, జైలర్ చిత్రాల్లో నటించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన జనతా గ్యారేజ్ సినిమాలోనూ కీలకపాత్ర పోషించారు మోహన్ లాల్. తనదైన నటనతో టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరైన మోహన్ లాల్ .. ఫ్యామిలీ గురించి మాత్రం అంతగా తెలియదు. తమిళ సినిమాల నిర్మాత కె. బాలాజీ కుమార్తె సుచిత్రను 1988లో వివాహం చేసుకున్నారు మోహన్ లాల్. వీరికి బాబు ప్రణవ్ మోహన్ లాల్, కూతురు విస్మయ మోహన్ లాల్ ఉన్నారు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇక కూతురు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టాలో కూతురి ఫోటోను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపారు మోహన్ లాల్. నిన్న తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. “నా యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పటికీ ప్రేమ, ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ నాన్న” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మోహన్ లాల్ షేర్ చేసిన ఫోటో వైరలవుతుంది. చాలా కాలం తర్వాత ఆయన కూతురి ఫోటోను చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Mohanlal (@mohanlal)

విస్మయ .. ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని తన ఇన్ స్టా హ్యాండిల్ చూస్తే అర్థమవుతుంది. ప్రకృతిని ఎక్కువగా ఆరాధించే విస్మయ.. కవిత్వాలు కూడా రాస్తుంది. ఇటీవల తన హాఫ్ ఫేస్ ఫోటో షేర్ చేస్తూ.. సూర్యుడి చుట్టూ మరో కక్ష్య అంటూ రాసుకొచ్చింది. అలాగే ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా నేచర్.. ట్రావెలింగ్ ఫోటోస్ కనిపిస్తున్నాయి. అంతకు ముందు తన తల్లి సుచిత్రకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది విస్మయ. తన తల్లి అమెరికన్ సింగర్ రాడ్ స్టీవర్ట్‌కి వీరాభిమాని. దీంతో ఆమెను లైవ్ షో చూసేందుకు తీసుకెళ్లగా, సుచిత్ర తనను తాను మరిచిపోయి సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
మీరు ఇప్పుడే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలా?
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం